Breaking News

లోకేష్‌ పెళ్లిపై చంద్రబాబు నాన్సెన్స్‌ అన్నారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Published on Fri, 01/19/2024 - 10:40

సాక్షి, విశాఖపట్నం: నారా లోకేష్‌ పెళ్లి అంశంపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర ‍వ్యాఖ్యలు చేశారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చంద్రబాబు అనేవారు. నాన్సెన్స్‌ అని నన్ను తిట్టేవారు. కానీ, తర్వాత బాలకృష్ణ కూతురును నారా లోకేష్‌కు ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని చెప్పుకొచ్చారు.

కాగా, యార్లగడ్డ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలో కూడా టీడీపీ నేతలు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుంది. తారక్ ప్లెక్సీలు తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం లేదు. తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే అది వారికే నష్టం. 

గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అని చంద్రబాబును అడిగాను. నాన్సెన్స్ అని నన్ను చంద్రబాబు తిట్టారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారు. తర్వాత లోకేష్‌కు బాలకృష్ణ కూతురినిచ్చి చంద్రబాబు వివాహం చేశారు. 

అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం. అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. సీఎం జగన్‌పై పిచ్చి కేసులు పెట్టారు. లక్ష కోట్ల అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారు. సీఎం జగన్ ఒక హీరో. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మాత్రమే. అలాంటి నేత దేశంలో మరొకరు లేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)