Breaking News

ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. కొలికపూడిపై భగ్గుమన్న మహిళలు

Published on Mon, 09/30/2024 - 13:12

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చిట్టేల మహిళలు భగ్టుమంటున్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడి సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

కాగా, తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వారం రోజులుగా జరుగుతున్న రగడకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దిగుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తలంటి దూకుడు తగ్గించుకోవాలని, నాయకులను కలుపుకొని పోవాలని పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరువూరు మండలంలోని చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యే బహిరంగంగా దూషించడమే కాక గుడ్డలూడదీసి కొడతానంటూ అసభ్య పదజాలంతో తిట్టడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గాలు నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో  చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును సైతం నాయకులు కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.

ఇంతవరకు నియోజకవర్గంలోని సీనియర్ల ముఖం సైతం చూడని ఎమ్మెల్యే శ్రీనివాసరావు వైఖరిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ‘తిరువూరును రక్షించండి’ నినాదంతో సోమవారం సాయంత్రం పట్టణంలో పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే, అధిష్టానం ఆదేశాలతో విరమించుకున్నారు. దీనికి తోడు ఫేస్‌బుక్‌ వేదికగా ‘అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ ఎమ్మెల్యే పోస్టింగ్‌ పెట్టడంతో టీడీపీ నాయకులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబట్టడం, విలేకరులను ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించడం తదితర ఘటనలతో పార్టీకి, ప్రజలకు ఎమ్మెల్యే దూరమవుతున్నారని గ్రహించిన అధిష్టానం వెంటనే నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.

సింగల్ గా వస్తావా..! మహిళలకు కొలికపూడి మెసేజ్ లు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)