Breaking News

యూపీలో బీజేపీకి తగ్గిన సీట్లు.. ఆరు కారణాలు ఇవే!

Published on Thu, 07/18/2024 - 16:17

లక్నో: లోక్‌ సభ ఎన్నికల్లో తమకు కుంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ  ఆశించిన ఫలితాలను సాధించలేదు. గత లోక్‌ సభ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా సీట్లు తగ్గాయి. అయితే లోక్‌ సభ ఎన్నికల్లో వైఫల్యానికి గల కారణాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం  హైకమాండ్‌కు నివేదికి సమార్పించింది. 

ఈసారిగా ఓటమి, సీట్లు తగ్గుదలకు గల కారణాలను అందులో వివరించారు.  ఈ నివేదికను అన్ని  పార్లమెంట్ నియోజకవర్గాలు ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లు ఆమేథీ, అయోధ్యల్లో మొత్తంగా సుమారు 40 వేల కార్యకర్తలు అభిప్రాయలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆశించి సీట్ల రాకపోవడానికి ఈ నివేదిక ఆరు ప్రధానమైన కారణాలను వెల్లడించింది.  

  • క్షేత్రస్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ లేకపోవటం. ప్రభుత్వం అధికారుల చేతిలో అధికారంలో ఉండటంతో పార్టీ కార్యకర్తల తీవ్రంగా అవమానంగా భావించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయలేకపోయాయని ఓ సీనియర్‌ నేత పేర్కొన్నారు.

  • రాష్ట్రంలో  గడిచిన మూడేళ్లలో సుమారు 15 సార్లు పేపర్ల లీక్‌ అయ్యాయి. దీన్ని  ప్రతిపక్షలు ప్రజల్లో తీసుకువెళ్లటంలో విజయం సాధించారు. దీంతో బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మారు.

  • ప్రభుత్వంలో పెద్దస్థాయిలో పోస్టులను కాంట్రాక్టుల ఉద్యోగులతో భర్తీ చేయిటంలో ప్రతిపక్షాల ఆరోపణలు మరింత బలం చేకూరి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

  • కూర్మీ, మౌర్య సామాజిక వర్గాలు ఓట్లు ఈసారి బీజేపీ పడలేదు. దీంతో పాటు దళిత ఓటర్లను కూడా బీజేపీ తమవైపు తిప్పుకోలేకపోయింది. బీఎస్పీతో   ఓటు బ్యాంక్‌ ఉన్న దళితులను తమవైపుకోని కాంగ్రెస్ ఓటుషేర్‌ను పెంచుకుంది.

  • ఎన్నికలకు ముందుగానే బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కార్యకర్తలు సైతం ఎన్నికల ప్రచారంలో నిర్లక్ష్యం వహించారు. పలు దశల్లో పోలింగ్ జరగటంతో కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గుతూ వచ్చింది.

  • రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర నాయకులే వ్యాఖ్యలు చేయటంతో వాటిని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీజేపీ నేతలు వ్యాఖ్యలను  ప్రజలు సీరియస్‌గా తీసుకోని ప్రతిపక్షాలవైపు  మొగ్గుచూపారు.

బీజేపీ 370 సీట్ల నినాదంతో ఎన్నికల బరిలోకి దిగగా..  240 సీట్లకు పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో  బీజేపీ అధికారంలో వచ్చి మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లకు  గతంలో 62 సీట్ల నుంచి 33 స్థానాలుకు తగ్గిపోయింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లను గెలుచుకుంది. దీనిపై ఇటీవల యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరీ, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి పార్టీ ఓటమిపై చర్చలు జరిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)