Breaking News

రాహుల్​కు.. హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి

Published on Sun, 01/30/2022 - 17:49

చండీగఢ్: కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్​ సిమ్రత్​ కౌర్​ బాదల్​ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్​ వేదికగా మండిపడ్డారు. కాగా, రాహుల్​ గాంధీ గత బుధవారం పంజాబ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమృత్​ సర్​లోని స్వర్ణ దేవాలయం​ను సందర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్​  తన జేబులో నుంచి చోరీ  జరిగినట్లు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఈ ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై హర్​సిమ్రాత్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్​ గాంధీ.. ఒక జెడ్​ క్యాటగిరి భద్రతను కల్గిఉన్నారని.. ఆయనతోపాటు పంజాబ్​ సీఎం చన్నీ, డిప్యూటి సీఎం సుఖ్ జీందర్​ సింగ్​ రంధావా, ఓపీ సోనిలుకూడా ఉన్నారన్నారు. ఇలాంటి చోట చోరీ జరగటం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన ప్రదేశానికి చెడ్డపేరు తెచ్చేల వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా ప్రవర్తించకూడదన్నారు.  అసత్య ప్రచారాలు మానుకోవాలని రాహుల్​కు చురకలంటించారు. అయితే, రాహుల్​ ఆరోపణలపై.. పూర్తి వివరాలను వెల్లడించలేదని ఎంపీ హర్​సిమ్రాత్​ కౌర్​బాదల్​ అన్నారు. కాగా, రాహుల్​ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం రోజు జలంధర్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవిషయం తెలిసిందే. 

హర్​ సిమ్రాత్​ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్​ సింగ్​ సుర్జేవాలా ఆమె పోస్ట్​కు రీట్వీట్​ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం అపచారమని  అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా బాధ్యతతో, పరిపక్వతతో ప్రదర్శించాలని తెలిపారు. గతంలో నరేంద్రమోదీ  తీసుకువచ్చిన చట్టాలు.. రైతుల జేబులు కొట్టడం లాంటివేనని అన్నారు.

చదవండి: ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు


 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)