Breaking News

మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఎవ‌రికి ఏ ప‌ద‌వులు?

Published on Sat, 06/08/2024 - 13:32

Update

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో నితీష్ కుమార్‌కు చెందిన‌ జేడీయూకి  రెండు  శాఖలు లభించ‌నున్న‌ట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

  • జేడీయూ సీనియ‌ర్ నేత‌లు లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాగూర్ పేర్ల‌ను పార్టీ ప్రతిపాదించింది. కాగా లాలన్ సింగ్ బిహార్‌ళోని ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వ‌గా..  రామ్ నాథ్ ఠాగూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా రామ్ నాథ్ ఠాగూర్‌ భారతరత్న అవా గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.

న్యూఢిల్లీ: మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ కూర్పుపై క‌స‌ర‌త్తు కొనసాగుతోంది.

ఈ క్ర‌మంలో  అమిత్ షా నివాసంలో శనివారం ఎన్డీయే కూటమి నేతలు సమావేశ‌మ‌య్యారు. ఈ భేటీకి జేపీ న‌డ్డా, బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం మోదీ 3.0 కేబినెట్‌లో ఎవ‌రెవ‌రికి మంత్రి ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయ‌నే అంశంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంగా మారింది. అయితే ఎన్​డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు కీల‌క ప‌ద‌వులు కోరుతూ తమతమ డిమాండ్​లను మోదీ ముందు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

అయితే కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు బీజేపీ త‌న‌వ‌ద్ద‌నే ఉంచుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అటు టీడీపీ మూడు మంత్రు పదవులతోపాటు, రెండు సహాయ మంత్రి పదవులు  కోరుతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. ఇక మూడు మంత్రి ప‌ద‌వులతోపాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.  వీటితోపాటు  శివసేన, ఎన్సీపీ, ఆర్ ఎల్జేపీ ఒక్కొక్క మంత్రి పదవి కోరుతున్న‌ట్లు స‌మాచారం.

ఇక‌ శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో కూటమి పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడంలో చంద్రబాబు, నితీశ్‌లు కీలకంగా వ్యవహరించారు.ఇండియా కూటమితో ఇరువురూ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలకు తెరదించుతూ లిఖితపూర్వకంగా మోదీకి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో  ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీకి దీటుగా ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. ప్రతిపక్ష కూటమి 232 సీట్ల‌ను గెలుచుకుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ 328 స్థానాల్లో పోటీచేసి 99 సీట్లను గెలుచుకుంది.

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ స్వ‌త‌హాగా 242 స్థానాలు గెలుచుకున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన‌  మెజారిటీ రాకపోవడంతో.. ఎన్టీయే మిత్ర ప‌క్షాల‌తో క‌లిసి కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతుంది. ఎన్డీయేలో భాగ‌మైన టీడీపీి 16 స్థానాలు, నితీష్‌కుమార్‌కు చెందిన జేడీయూ 14, ఏక్‌నాథ్ షిండే నేత‌!త్వంలోని శివ‌సేన 7, లోక్‌జ‌న‌శ‌క్తి రామ్ విలాస్ 3 చోట్ల విజ‌యం సాధించింది. దీంతో మొత్తం 290 స్థానాల్లో ఎన్డీయే గెలుపొందింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)