Breaking News

కాంగ్రెస్‌ ప్రత్యర్థిగా షారూఖ్‌ తండ్రి.. నాడు ఏం జరిగింది?

Published on Sun, 04/07/2024 - 10:00

రాజకీయాల్లోకి సినీతారలు ప్రవేశించడం కొత్తవిషయమేమీ కాదు. అయితే వారు రాజకీయాల్లో ఎంతవరకూ రాణిస్తారనేది ఆసక్తికర అంశం. బాలీవుడ్‌‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే ఆ తరువాత ఏం జరిగింది?

హిందీ నటుడు షారూక్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ స్వాతంత్ర్య  సమరయోధుడు. నాడు ఆయనకు కాంగ్రెస్‌లో పలువురు సన్నిహిత మిత్రులు ఉండేవారు.  స్వాతంత్య్రానంతరం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మీర్ తాజ్ మహ్మద్‌కు లభించింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.

1957లో దేశంలో జరిగిన రెండవ సాధారణ ఎన్నికల్లో తాజ్ మహ్మద్ గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన నాటి కాంగ్రెస్‌ దిగ్గజ నేత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల రణరంగంలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాటి ఎన్నికల్లో భారత తొలి విద్యా మంత్రి అబుల్ కలాం ఆజాద్  అమోఘ విజయం సాధించారు. జనసంఘ్ అభ్యర్థి మూల్ చంద్ రెండో స్థానంలో నిలిచారు. 

తాజ్ మహ్మద్‌ జాతీయవాద నేత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరుడు. మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో తాజ్ మహ్మద్ చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. పెషావర్‌లో పెరిగిన తాజ్ మహ్మద్ న్యాయశాస్త్రం చదివేందుకు ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు. 1947లో భారత్‌-పాక్‌ విభజన సమయంలో తాజ్ మహ్మద్‌ ఢిల్లీలోనే ఉన్నారు. కారవాన్‌లో ప్రచురితమైన ఇరామ్ అఘా నివేదిక ప్రకారం విభజన అనంతరం పాక్‌ ప్రభుత్వం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, తాజ్ మహ్మద్‌ అనుచరులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. నాటి నుంచి తాజ్‌ మహ్మద్‌ ఢిల్లీలోనే ఉండిపోయారు.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)