Breaking News

కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్‌ Z ఇలా ఉ‍ందేంటి?

Published on Sun, 06/07/2026 - 21:36

బొద్దింక అంటే ఏంటి? ఒక పురుగా, ఒక కీటకమా, లేక అసంతృప్తితో ఉన్న భారతీయ యువకుడిని అలా పిలుస్తున్నారా? కొత్తగా రూపుదిద్దుకుంటున్న "కాక్రోచ్ జనతా పార్టీ"ని ఇష్టపడుతున్న వారిని అడిగితే ‘‘పైవి అన్నీ’’ అనే సమాధానం వస్తుంది. ఇప్పటివరకు ఇది వ్యంగ్యంగా పుట్టిన ఒక ఆసక్తికర గ్రూప్‌ మాత్రమే. ఇదొక క్వాసీ రాజకీయ పార్టీ. అంటే పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాకపోయినా, రాజకీయ లక్ష్యాలు ఉన్న పార్టీ లేదా రాజకీయాలపై ప్రభావం చూపే గ్రూపు.

కానీ భారత ప్రజాస్వామ్య ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్న దేశ యువతకు తామే ప్రతినిధులమని ఇది చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని మిలియన్ల మంది అలా భావిస్తున్నారు. అయితే, ఇది క్షణికావేశం, కొన్ని రోజుల్లో నిరుగారిపోయే ఉత్సాహమేనా?

కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్‌లైన్ జోక్‌గా మొదలైంది. నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఇది పుట్టుకొచ్చింది. ఆ మీమ్ వేగంగా వ్యాపించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మిలియన్ల మంది దాని సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టారు. చాలా మంది వ్యాఖ్యాతలు వెంటనే దీన్ని బీజేపీ వ్యతిరేక ఉద్యమంగా అభివర్ణించారు. కానీ అది కథలో సగం మాత్రమే.

పెద్ద సందేశం ఏమిటంటే, ఎన్నికల్లో యువత భాగస్వామ్యం భారీ స్థాయిలో ఉందని గణాంకాలు చూపుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలకు అదే బలమైన కొలమానం. అనేక దేశాల్లో జెన్ జీ ఓటర్లు రాజకీయాలను చాలా భిన్న దృష్టితో చూస్తున్నారు. భారతదేశంలో వారిలో చాలా మంది బీజేపీ పాలన కాలంలోనే (2014 నుంచి ఇప్పటివరకు) పెరిగారు. ఉద్యోగాలు, జీవన వ్యయం, గృహాలు, రవాణా, స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజా సేవలు. ప్రస్తుత రాజకీయ వర్గం ఈ ప్రాథమిక అవసరాలను అందిస్తోందా? అని చాలా మంది భావిస్తున్నారు. ఆ అసంతృప్తి కొత్త గొంతుకలకు, కొత్త మార్పులకు అవకాశం కల్పిస్తోంది.

అయితే, సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రజాదరణ ఎన్నికల వేళ ఉండే ప్రజాదరణతో సమానం కాదు. మిలియన్ మంది ఫాలో అయ్యే వారు ఉన్నారంటే, అదే మిలియన్ మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. వాస్తవానికి మిలియన్ మంది అనుసరించే ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ నిజమైన ఎన్నికల్లో కొన్ని వందల ఓట్లు కూడా పొందడంలో ఇబ్బంది పడవచ్చు. ఆన్‌లైన్‌లో ఎవరినైనా అనుసరించడానికి ఒక ట్యాప్ చాలు. కానీ ఓటు వేయడానికి నిబద్ధత, వ్యవస్థీకరణ, విశ్వాసం, ఓటర్ల హాజరు అవసరం.

కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? 
కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నటికీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కనుమరుగైపోవచ్చు. కానీ దాన్ని తక్కువ అంచనా వేయడం కూడా పొరపాటే. ఎందుకంటే ఉద్యమాలు తరచుగా హాస్యం, అసంతృప్తితోనే మొదలవుతాయి.

అప్పట్లో భారత్ అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ప్రజల ఆగ్రహానికి వ్యక్తీకరణగా మొదలైంది. నెట్‌వర్క్‌లు, చర్చలు, పౌరుల భాగస్వామ్యంతో అది వేగం అందుకుంది. మిలియన్ల మంది ఒక జోక్ (సీజేపీ వంటి) వెనుక నిలబడినప్పుడు, ఆ జోక్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దాన్ని ఏ రాజకీయ వర్గమైనా వినడం మంచిది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)