Breaking News

జమిలి ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ విధానమేంటి? 

Published on Mon, 09/04/2023 - 01:26

సాక్షి, హైదరాబాద్‌: జమిలి ఎన్నికల నిర్వహణపై తన విధానమేంటో బీఆర్‌ఎస్‌ స్పష్టం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పట్లో బీజేపీతో ఉన్న సంబంధాల దృష్ట్యా జమిలి ఎన్నికలకు తాము అనుకూలమని 2018లో సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని, ఇప్పుడు బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న కేసీఆర్‌ తాజాగా తన పార్టీ వైఖరి ఏంటో వెల్లడించాలని కోరారు.

ఆదివారం గాంధీభవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి వస్తుందనే వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌ తెరమీదకు తెచ్చారని విమర్శించారు. ఈ విధానానికి ఇండియా కూటమి వ్యతిరేకమని, అందుకే కమిటీ నుంచి అధీర్‌ రంజన్‌ చౌదరి వైదొలిగారని చెప్పారు. 

ఆ కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతినా? 
జమిలి ఎన్నికల బిల్లు పాస్‌ కావాలంటే పార్లమెంటులో 2/3 వంతుల మెజారీటీ కావాలని, ఈ విధానంతో రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి భంగం కలుగుతుందని రేవంత్‌ పేర్కొన్నారు. ఒక పార్టీ చేతిలో అధికారం పెట్టుకునేందుకే బీజేపీ ఈ కుట్రకు పాల్పడుతోందని, ఈ కుట్ర వెనుక అధ్యక్ష తరహా విధానాన్ని తీసుకు రావాలన్న ఆలోచన బీజేపీకి ఉందని ఆరోపించారు.

అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగితే దక్షిణ భారతదేశ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇంత జరుగుతున్నా కేసీఆర్‌ మౌనంగా ఉన్నారంటే ఆయన బీజేపీకి అనుకూలమని అనుకోవాలా అని ప్రశ్నించారు. దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి హోదాలో పనిచేసిన వ్యక్తిని జమిలి ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా నియమించి ఆ పదవికే కళంకం తెచ్చారని విమర్శించారు. 

బోయలకు కేసీఆర్‌ మోసం.. మేం న్యాయం చేస్తాంః రేవంత్‌ 
బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి సీఎం కేసీఆర్‌ మాట తప్పారని, అధికారంలోకి వచ్చి పదేళ్లవుతున్నా ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టు కోలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వాల్మికి బోయలు ఆదివారం గాందీభవన్‌లో రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కలిశారు.

తమను ఎస్టీల్లో చేర్చాలని, ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ వారికి వినతిపత్రం సమరి్పంచారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ 2014లోనే బోయ వర్గానికి చెందిన భీముడిని ఎమ్మెల్సీ చేస్తానని చెప్పిన కేసీఆర్‌ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. గద్వాల బంగళా రాజకీయాలకు స్వస్తి పలికేలా బోయలు కదలాలని, అవకాశం ఉంటే బోయలకు ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీనిచ్చారు. 

ఖానాపూర్, కొడంగల్‌ నుంచి చేరికలు 
నియోజకవర్గం బొమ్రాస్‌పేట మండలానికి చెందిన పలువురు నేతలు, ఖానాపూర్‌ నియోజకవర్గం జన్నారం, కడెం, ఉట్నూరు, ఇంద్రవెల్లికి చెందిన పలువురు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి గాందీభవన్‌లో కండువాలు కప్పి రేవంత్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)