Breaking News

పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే.. అక్కడ ఏం జరిగింది?

Published on Wed, 04/05/2023 - 14:41

పవన్ కల్యాణ్ ప్రకటన చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉంది.. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లింది.. బీజేపీ బలపడాలని వారికే చెప్పడానికా..? అసలు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఎవరి కోసం..? ఎందుకోసం..? ఆయన సాధించిందేంటీ..?. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ బీజేపీ. ఏపీలో బలహీనంగా ఉండొచ్చు.. కానీ పవన్ కల్యాణ్ లాంటి బలహీనుడి దగ్గర సలహాలు అయితే తీసుకోదు కదా..!

జనసేన స్థాపించి పదేళ్లైనా.. టీడీపీ జెండాలు మోయడానికి, చంద్రబాబు మౌత్ పీస్‌గానే పని చేస్తుందని ప్రజలకు తెలియనిది కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జెండా ఉన్నా.. అద్దెకివ్వడానికే.. అజెండాలేని.. సిద్దాంతాలు ఏమాత్రం లేని పార్టీ జనసేన.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై చంద్రబాబు లైన్‌ను వినిపించడానికి బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్‌ కోసం పవన్ కల్యాణ్ 48 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. నడ్డాతో భేటీ తరువాత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్ చూస్తే విశాఖపట్నంలో ప్రధాని మోదీ క్లాస్ పీకినట్లు కనిపించిన లాంగ్వేజ్‌నే కనిపించింది. నడ్డా కూడా పవన్ కల్యాణ్‌కు క్లాస్ పీకి ఉంటాడని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్‌నే చెబుతోంది. ఏపీలో ఏమాత్రం బలంలేని జనసేన. బలపడాలని బీజేపీకి సూచించానని.. పవన్ చెప్పడం నమ్మశక్యంగా లేదు.
చదవండి: యెల్లో బ్యాచ్‌ డ్రామాకు సీఎం జగన్‌ చెక్‌

టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదని నడ్డా.. పవన్ ముఖం మీద చెప్పడం వల్లనే.. పొత్తుల గురించి చర్చించలేదని.. పవన్ కల్యాణ్ మీడియా ముందు అబద్ధం చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్ అజెండా క్లియర్‌.. టీడీపీ - జనసేన పొత్తులోకి బీజేపీని లాగి.. 2014లా 2024లో పోటీ చేయాలనేది పవన్ ఉబలాటం. కానీ...చంద్రబాబును బీజేపీ అధిష్టానం నమ్మే పరిస్థితి లేదు. అందుకే.. హెచ్చరికలతోపాటు.. హితోపదేశం బీజేపీ పెద్దలు చేస్తున్నా.. పవర్ లెస్ స్టార్‌ చెవికెక్కడం లేదు. చంద్రబాబు లైన్‌లో ఢిల్లీ వెళ్లిన పవన్.. చివరకు మీడియాతో అబద్ధాలు చెప్పి.. బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)