Breaking News

ఏం చేసినా మీకు ఫలితం లేదు..  X పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు 

Published on Thu, 12/21/2023 - 04:12

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ పార్టీలో కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌కే ప్రాధాన్యం.. మీరెంత కష్టపడ్డా ఫలితం లేదు’... అంటూ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ‘మీ పార్టీ మాదిరి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు’అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యుడు మాజీ మంత్రి హరీశ్‌రావు ఒకరిపై ఒకరు చేసుకున్న రాజకీయ విమర్శలు బుధవారం శాసనసభలో దుమారం రేపాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా వాతావరణం కొద్ది సేపు వేడెక్కింది.

గత బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై సభ చర్చ చేపట్టింది. హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఇది శ్వేతపత్రం కాదు.. కోత పత్రమంటూ ఎద్దేవా చేశారు. ఈ దశలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘హరీశ్‌రావు ఎంత కష్టపడ్డా ఫలితం లేదు. కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ ఉంటారు. మిమ్మల్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు’అని వ్యాఖ్యానించారు. 

హరీశ్‌కు మేనమామ పోలికలు.. అందుకే అబద్ధాలు: రాజగోపాల్‌రెడ్డి
ఇదే క్రమంలో ‘ఆయనకు మేనమామ పోలికలు వ చ్చాయి. కేసీఆర్‌ చెప్పినట్టే అబద్ధాలు చెబుతున్నా రు’అని కోమటిరెడ్డి అనడంతో బీఆర్‌ఎస్‌ పక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్ళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ సభను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, బీఆర్‌ఎస్‌ సభ్యులు వెనక్కు తగ్గలేదు.

సభా వ్యవహారాల  మంత్రి డి.శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ ‘ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎదురుదాడికి దిగడం సరికాదు... స్పీకర్‌ను బెదిరించడం ఏమిటి?’అని ఆక్షేపించారు. ‘పదేళ్లు విపక్షంలో కూర్చున్నాం... రెండు రోజులకే మీకు అసహనం వస్తే ఎలా’అంటూ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చె ప్పేందుకు హరీశ్‌రావుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. 

రూ. 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కునే ఖర్మ పట్టలేదు: హరీశ్‌ 
తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించిన హరీశ్‌రావు ‘పీసీసీ పదవిని రూ. 50 కోట్లకు కొనుక్కునే ఖర్మ మాకు పట్టలేదు. పదవి కొనుక్కున్నారనే మాట అన్నది కోమటి రెడ్డి బ్రదర్సే’అనడంతో కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ఇరుపక్షాల వాగ్వాదంతో సభ మరింత వేడేక్కింది.

హరీశ్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు పట్టుబట్టారు. లేదంటే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే తాను విత్‌డ్రా చేసుకుంటానని హరీశ్‌రా వు అన్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుతున్న తరుణంలోనే హరీశ్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. 

బావ.. బామ్మర్దుల గురించి చెప్పాలా?: మంత్రి కోమటిరెడ్డి 
హరీశ్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో మా పార్టీ ముందుకెళ్తోంది. మీకేం పనిలేదా? మీ పదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పకుండా మాపై విమర్శలేంటి?’అంటూ మండిపడ్డారు. హరీశ్‌ను ఉద్దేశిస్తూ ’మీ బావ... బామ్మర్దులు ఎంత కొట్టుకున్నారో చెప్పాలా...?’అంటూ ప్రశ్నించారు. ఇన్నేళ్లు దోచుకున్న విషయాలు బయటికొస్తున్నాయనే భయంతో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)