Breaking News

సీనియర్లు.. ఎదురు‘తన్నులు’

Published on Sun, 03/03/2024 - 02:14

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకులకు అవమానాలే తప్ప సీట్లు దక్కే పరిస్థితి లేదు. సమీకరణలు, పొత్తుల పేరుతో సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన వారిని చంద్రబాబు పక్కనపెడుతున్నారు. తొలి జాబితాలో చాలామందికి సీటు నిరాకరించగా వారికి దాదాపు అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సీటు నిరాకరించిన చంద్రబాబు ఆయన కుటుంబంలో ఒకరికి సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో చింతమనేనిని పక్కనపెట్టారు.

చంద్రబాబుకు గట్టి మద్ధతుదారుగా ఉన్న తనకు తగిన గుణపాఠం చెప్పారని ఆయన రగిలిపోతున్నారు.  చింతమనేని స్థానంలో ఆయన కుమార్తెకి సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. దీంతో తనను అవమానిస్తున్నారని, పార్టీ కోసం ఇన్నాళ్లూ పని చేయించుకుని ఇప్పుడు పక్కనపెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర కీలక నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయని చంద్రబాబు ఆయన మద్ధతుదారులను సైతం పక్కనపెట్టారు.

యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో ఆయనకు సీటు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు వంటి వారికి సీటిచ్చి తనను కాదనడం అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కళాకు సర్దిచెబుతున్నా ఆయన మాత్రం ఒప్పుకోకుండా తన సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. 


లాబీయింగ్‌ వదలని గంటా.. చంద్రబాబు ససేమిరా ! 
మరో సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి మరీ ఇరకాటంగా మారింది. ఆయన్ను విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆయన ధన బలం, తన సామాజికవర్గ బలాన్ని చూపిస్తూ అధిష్టానాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం పంపించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గంటా మాత్రం భీమిలి స్థానం కోసం అన్ని రకాలుగా లాబీయింగ్‌ చేస్తూనే ఉన్నారు. జనసేన పొత్తులో విశాఖ జిల్లా పెందుర్తిలో తన సీటు ఎగిరిపోతుండడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనకు సీటు ఇవ్వకపోతే తన తడాఖా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో వలస నేత వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరంలో అవకాశం ఇస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. తనకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని కృష్ణప్రసాద్‌ అందరికీ చెబుతూ మద్ధతు కోరుతున్నారు. దేవినేని ఉమా మాత్రం చివరి నిమిషంలో అయినా తనకే సీటు ఖరారు చేస్తారనే ఆశతో తిరుగుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉమాను పక్కన పెట్టినట్లు  ప్రచారం జరుగుతోంది. 

యరపతినేనికి ఎసరే! 
ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్‌ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావును గురజాల నుంచి తప్పించాలనే నిర్ణయంతో పల్నాడు ప్రాంత టీడీపీలో అయోమయం నెలకొంది. యరపతినేని స్థానంలో వలస నేత జంగా కృష్ణమూర్తిని పోటీకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు మింగుడుపడడంలేదు.

ఆయన్ను నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నా దానిపైనా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుతం యరపతినేని గాల్లో ఉన్నారు. మరోవైపు పొత్తులో తెనాలి సీటు జనసేకు పోవడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా తన పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తున్నా ఆయన్ను పట్టించుకున్న వారే లేరు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)