amp pages | Sakshi

బెజవాడ సైకిల్‌కు టెన్షనెందుకు?

Published on Sat, 01/14/2023 - 15:29

ఆ పసుపు నేత కాలం కలిసొచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈ సారి ఆయన పరిస్థితి రివర్స్‌ అయిందక్కడ. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పచ్చ పార్టీ ఎమ్మెల్యేకి ముచ్చెమటలు పడుతున్నాయట. తనకంటే వయసులో చిన్నోడే అయినా... అధికారపార్టీ యువనేతను చూస్తేనే సైకిల్ పార్టీ నేతకు టెన్షన్ ఎక్కువవుతోందట. అందుకే కడుపు మంటను చల్లార్చుకునేందుకు నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నాడు.

ఏడాది ముందే వెన్నులో వణుకు
ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర ఉండగానే బెజవాడ టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కి భవిష్యత్ గుర్తొచ్చి టెన్షన్ పెరుగుతోందట. ఒకప్పటి గన్నవరం ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ గత రెండు సార్లు విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు. రెండు సార్లు గెలిచినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి గద్దె చేసిందేమీ లేదు.

దివంగత నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏ పదవిలోనూ లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు బాగా చేరువయ్యారు. సీఎం జగన్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి.

ముఖ్యంగా సీఎం హామీతో కృష్ణలంక వాసుల చిరకాలవాంఛ అయిన కృష్ణానదిలో రిటైనింగ్‌ వాల్ ను 130 కోట్ల రూపాయలతో పూర్తిచేయగలిగారు. నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలతో అవినాష్ ముఖ్యమంత్రి జగన్‌ దృష్టిని ఆకర్షించారు. ఇటీవలే తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ ను ఖరారు చేశారు.

డ్రామా పాలిట్రిక్స్‌
ఈ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లో వణుకు మొదలైంది. ఇప్పటి వరకూ నియోజకవర్గానికి ఇంఛార్జి హోదాలోనే ఇంత అభివృద్ధి సాధిస్తే...అతన్నే అభ్యర్థిగా ప్రకటించడంతో ..ఇక తన మనుగడ కష్టమని గద్దె డిసైడైపోయారట. రాబోయే ఎన్నికల్లో తనకు పోటీగా దేవినేని అవినాష్ నిలబడితే తనకు డిపాజిట్లు రాననే భయంతో కుట్ర రాజకీయాలకు తెరతీశారు.

వైసీపీ ప్రభుత్వానికి, దేవినేని అవినాష్ కు మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక కడుపుమంటతో గడప గడప కార్యక్రమంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. అందులో భాగంగానే 17వ డివిజన్ పరిధి రాణీగారితోట ప్రాంతంలో గడప గడప కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్న సమయంలో ఓ టీడీపీ కార్యకర్తతో డ్రామా స్టార్ట్ చేశారు. కావాలనే తమ ఇంటికి అవినాష్ ను పిలిపించి తమకు పథకాలేవీ రావడం లేదంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. ఐతే వారికి ఏమేమి పథకాలు వచ్చాయో లిస్ట్ చదివి చెప్పడంతో టీడీపీ మహిళా కార్యకర్తలు కిమ్మనకుండా ఉండిపోయారట.
  టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్‌ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం

ముందు నాటకాలు.. తర్వాత గొడవలు
తన పాచిక పారలేదని గ్రహించి తెల్లారేసరికి పథకం ప్రకారం మళ్లీ అదే టీడీపీ మహిళా కార్యకర్తలు స్థానిక వాలంటీర్ తో పాటు వైసీపీ మహిళలతో గొడవకు దిగారు. వారి కళ్లల్లో కారం కొట్టి... దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఒక్కసారిగా తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా వేడి రాజుకుంది. ఈ దాడిని తమకు అనుకూలంగా చేసుకోవాలని గద్దె వేసిన స్కెచ్ వర్కవుట్ కాలేదట. తన ప్లాన్ బెడిసిగొట్టడంతో పాటు తనకే రివర్స్ అవ్వడంతో గద్దె షాక్ లో ఉన్నారట.
చదవండి: అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!

పథకాలు రావట్లేదని గొడవ చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఏమేమి అందాయో ఆధారాలతో సహా దేవినేని అవినాష్ బయటపెట్టడంతో గద్దె రామ్మోహన్ ను సొంత పార్టీ వాళ్లే అసహ్యించుకుంటున్నారని టాక్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడి పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకు తెలిసింది ఇలాంటి చీప్ పాలిట్రిక్సేనా అని తల బాదుకుంటున్నారట స్థానిక పసుపు క్యాడర్. దేవినేని అవినాష్ చేస్తున్న గడప గడప కార్యక్రమంతో గద్దే రామ్మోహన్‌కు గుబులు మొదలైందనే టాక్ తెలుగుదేశం వర్గాల్లోనే మొదలైంది.
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)