ప్రజలకు.. ‘వైఎస్‌ జగన్‌ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’

Published on Fri, 06/20/2025 - 16:47

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా,సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. వైఎస్‌ జగన్‌ రెంట పాళ్ల పర్యటనపై విడుదల రజిని శుక్రవారం మీడియా మాట్లాడారు.

పల్నాడుజిల్లా చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకూ వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడో మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. ఈ వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. 

ఇంకా ఆమె ఎమన్నారంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఏకంగా మాజీ సీఎం ఎస్‌ జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ మాట్లాడారు. ఆయన పార్టీలోని మరో  నేత బుచ్చయ్యచౌదరి విచక్షణ మరిచి వైఎస్‌ జగన్‌కు హాని కలిగిస్తామనే రీతిలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇవ్వన్నీ చూస్తుంటే టీడీపీ తెర వెనుక ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రజాధరణకు పల్నాడు పర్యటనే సాక్ష్యం
పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ చెందిన నాయకుడు నాగమల్లేశ్వరరావును పోలీసుల ద్వారా తీవ్రంగా వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్ వస్తున్న నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి, ఆయన పర్యాటనను విఫలం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. ఈ పర్యటనకు వాహనాలను అందించకూడదని ట్రావెల్ ఏజెన్సీలను బెదిరించారు, పెట్రోల్ బంక్‌లు, హోటళ్ళను బలవంతంగా మూసివేయించారు. అయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. వైఎస్ జగన్‌కు అడుగుడుగునా స్వాగతం పలుకుతూ రోడ్లపై పోటెత్తారు. వైఎస్ జగన్ అంటేనే దేశంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వ మోసాన్ని గుర్తించామంటూ వైఎస్ జగన్‌కు ప్రజలు తమ మద్దతును ప్రకటించారు.

చనిపోయిన వారిపైనా రాజకీయమా?
వైఎస్ జగన్ పర్యటనలో దురదృష్టవశాత్తు ఇరువురు చనిపోతే, దానిని కూడా వివాదంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. వైఎస్ జగన్ కాన్వాయి వాహనం తగిలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. అలాగే సత్తెనపల్లిలో ఒక యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు, అతడిని ఆసుపత్రికి తరలించే సరికే అతడు చనిపోయాడు. ఈ ఘటనలు గురించి తెలియగానే వైఎస్ఆర్‌సీపీ నేతలు వారి కుటుంబసభ్యులను పరామర్శించడం, ఆ కుటుంబాలకు ఆర్థిక సాయంను అందచేయడం కూడా జరిగింది. ఆ కుటుంబాల పట్ల మా బాధ్యతను ఎక్కడా మరిచిపోలేదు. చివరికి వారి అంత్యక్రియల్లో కూడా పార్టీ నేతలు ఎంతో బాధతో పాల్గొని, ఆ కుటుంబాలను ఓదార్చడం జరిగింది.  

అమాయకుల ప్రాణాలను బలికొన్నది చంద్రబాబు కాదా?
చంద్రబాబు గతంలో సీఎంగా ఉండి, గోదావరి పుష్కరాల సందర్బంగా తన ప్రచారయావతో 29 మందిని బలితీసుకున్నారు. ఇరుకుసందుల్లో సభలను పెట్టి, జనాలను ఎక్కువగా చూపాలనే ప్రయత్నంలో భాగంగా కందుకూరిలో ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నారు. అలాగే గుంటూరులో టీడీపీ తరుఫున చీరెల పంపిణీ పేరుతో మహిళలకు ఆశచూపి, తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితిలో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబు అసమర్థ పాలనలో తిరుపతి క్యూలెన్లలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరి కుటుంబాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ మరణాలు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలు కావా? తన వల్ల జరిగిన దారుణాలను చంద్రబాబు మరిచిపోయారా?’ అని ప్రశ్నించారు.

YSRCP శ్రేణులను పోలీసులు బెదిరించారు:

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)