Breaking News

విజయవాడలో ఇళ్ల కూల్చివేతకు యత్నం.. బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ

Published on Mon, 08/25/2025 - 11:52

సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1995లో ఒక వ్యక్తి నుంచి  42 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకుని ఆ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ స్థలం తనదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. మరోవైపు, తమ అసోసియేన్‌కే స్థలం చెందుతుందంటూ వాదనలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 42 కుటుంబాల వారు కోరుతున్నారు.

ఇవాళ ఉదయం కోర్టు ఆర్డర్‌తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.  ఫ్లాట్ ఓనర్స్, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎలా కూల్చుతారంటూ బాధితులు అండగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధర్నాలో పాల్గొన్నారు.

పేదల ఇళ్లు కూల్చడమేనా పీ-4 అంటే..
వెల్లంపల్లి మాట్లాడుతూ.. 42 మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?. మునిసిపల్ ప్లాన్ ఉంది.. బ్యాంక్ లోన్ ఉంది.. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగింది. పోలీసులు, ప్రభుత్వాలు పేదలను కాపాడాలి.. కానీ వారి పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం.. అధికారంంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక ఇల్లు కట్టలేదు.. పేద వారి ఇల్లు కూల్చడమేనా పీ-4 అంటే.. మహిళలను జుట్టులు పట్టుకొని లాగి పడేస్తున్నారు.

భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి సర్కార్‌
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి ఇళ్ల నుండి బయటకు లాగి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ప్రైవేట్‌ భూమి విషయంలో వందలాది మంది పోలీసులు వచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఉంది.

పేదల ఇళ్ల స్థలాలపై జనసేన నేతల కన్ను YSRCP నేతలు ఫైర్

కోర్టుని నమ్మించి..
వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్‌ పరిశీలకులు పోతిన మహేష్  మాట్లాడుతూ.. కోర్టుని నమ్మించి తమ భూమి అంటూ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. టైం ఇవ్వాలని అడిగిన పట్టించుకోకుండా కూల్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. జనవాణిలో మా భూములు కాపాడాలని అర్జీ ఇచ్చారు. ఇళ్లు కుల్చడానికి వచ్చింది జనసేన లీగల్ సెల్‌నే.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్వందించడం లేదో చెప్పాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)