Breaking News

‘డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి మ‌హిళ‌ల‌ను పావులుగా వాడుకోవ‌డం సిగ్గుచేటు’

Published on Wed, 06/11/2025 - 18:38

సాక్షి, తాడేప‌ల్లి: కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్‌ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్‌సీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..

ప్రతిపక్ష నేత వైఎస్‌ జ‌గ‌న్ ఎక్క‌డికెళ్లినా ప్ర‌జ‌లు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇది చూసి చంద్ర‌బాబు, లోకేష్ ఓర్వ‌లేక మ‌హిళ‌ల‌ను అడ్డం పెట్టుకుని డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి తెగబడ్డారు. వారి దిగ‌జారుడు రాజ‌కీయాలకు మ‌హిళ‌ల‌ను పావులుగా వాడుకుంటున్నారు. మ‌హిళ‌ల నిర‌స‌న పేరిట సాక్షి కార్యాల‌యాల‌ను టార్గెట్ చేసుకుని గ‌డిచిన మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచ‌కాల‌కు టీడీపీ కుట్ర చేసింది.

మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా ఆదుకోవ‌డం, ర‌క్ష‌ణ కల్పించ‌డం వంటివి చేయ‌క‌పోగా వారిని అడ్డం పెట్టుకుని కుట్ర రాజ‌కీయాలు చేయ‌డం దారుణం. ఏలూరులో సాక్షి కార్యాల‌యం మీద దాడికి టీడీపీ కుట్ర చేసింది. ముందుగా మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ను పంపించి, వారి వెనుక టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పంపించి దాడులు చేయించింది. తిరిగి ఆ నెపం వైయ‌స్సార్సీపీ మీద‌కు నెట్టాల‌ని చూస్తున్నారు.

మహిళల పేరుతో రాజకీయం బాబుపై వరుదు కళ్యాణి ఫైర్

రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు
సాక్షి టీవీ డిబేట్‌లో జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాట‌ల‌కు వైఎస్‌ జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం సిగ్గుచేటు. చంద్ర‌బాబులా మ‌హిళ‌ల గురించి ఏనాడైనా వైఎస్‌ జ‌గ‌న్ చుల‌క‌న‌గా మాట్లాడ‌టం జ‌రిగిందా? కోడ‌లు మ‌గ‌బిడ్డ‌ను కంటానంటే అత్త వ‌ద్దంటుందా అని మ‌హిళ‌ల పుట్టుకనే అవ‌మానించేలా మాట్లాడిందే చంద్ర‌బాబు. దానికి చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. వైఎస్‌ జ‌గ‌న్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ మ‌హిళ‌ల‌కు అమ్మ ఒడి, చేయూత‌, ఆస‌రా వంటి ప‌థ‌కాల‌తో అండ‌గా నిలిస్తే, చంద్ర‌బాబు త‌న కుట్ర రాజ‌కీయాల‌కు మ‌హిళ‌ల‌ను వాడుకుంటున్నాడు.

ఈ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు క‌నీస ర‌క్ష‌ణ కూడా లేదు. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌తో ఎంతోకాలం ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌లేరు. ఇలాంటి కుట్ర‌లు, వ‌క్రీక‌ర‌ణ‌లు ఎంతోకాలం సాగ‌వ‌ని గుర్తుంచుకోవాలి. కూట‌మి మోస‌పు హామీలు న‌మ్మి మోస‌పోయామ‌ని ఇప్ప‌టికే మ‌హిళ‌లు ఆందోళ‌నగా ఉన్నారు. పాల‌నా వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏడాది కాలంలోనే రూ.1.58 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం సూప‌ర్ సిక్స్‌లో ఒక్క ప‌థ‌కాన్ని కూడా పూర్తిగా అమ‌లు చేయ‌లేక‌పోయింది. మా ఐదేళ్ల పాల‌న‌లో చేసిన అప్పుల్లో 44 శాతం అప్పులు ఏడాదిలోనే చంద్ర‌బాబు చేసేశాడు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని దుస్థితిలోకి కూట‌మి ప్ర‌భుత్వం దిగ‌జారిపోయింది. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు త‌న కుట్ర రాజ‌కీయాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)