Breaking News

ఆ కేంద్రమంత్రి ఎవరో చెప్పండి.. సీఎంకి కిషన్‌రెడ్డి సవాల్‌

Published on Wed, 06/17/2026 - 05:37

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నట్టుగా చెప్పిన కేంద్రమంత్రి ఎవరో చెప్పాలని సవాల్‌ విసిరారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  

కిషన్‌రెడ్డి ఆపమంటే కేంద్రం ఆపదు 
‘మెట్రో ఫేజ్‌–2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌ కూడా ఈ విషయం రేవంత్‌రెడ్డికి తెలిపారు. మెట్రో ఫేజ్‌–1కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు అందించింది. ప్రధాని మోదీ స్వయంగా ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోని ఇతర నగరాలకు సహకరించినట్లే హైదరాబాద్‌కు కూడా సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం సహకరిస్తుంది. అంతేకానీ కిషన్‌రెడ్డి ఆపమంటే ప్రాజెక్టులు ఆపే సంస్కృతి కేంద్రంలో లేదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ లేదా రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటా..’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

కిషన్‌రెడ్డి ఆపారనడం సీఎంకు తగదు 
‘మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్‌ఎఫ్‌సీతో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధుల మంజూరును నేను ఆపాననడంలో కూడా వాస్తవం లేదు. దీనిపై కేంద్ర మంత్రి ఖట్టర్‌తో మాట్లాడా. మెట్రోకు వచ్చే ఆదాయం నుంచి ముందుగా ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలను చెల్లించాలని కేంద్రం కోరుతోంది. కానీ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని ఖట్టర్‌ చెప్పారు. నిజానికి దేశవ్యాప్తంగా ఏ మెట్రో ప్రాజెక్టులోనూ అప్పులను ముందే చెల్లించరు. ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన ఆదాయంతో రుణాలు చెల్లించేలా చూస్తేనే మెట్రో మనుగడ సాగిస్తుందని నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఆయన అంగీకరించలేదు. సాంకేతిక, ఆర్థిక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, నిధులు ఇవ్వొద్దని కిషన్‌రెడ్డి చెప్పారని ఆరోపించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు..’అని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు. 

కేంద్రం నిధుల వెల్లువ..  
తెలంగాణ అభివృద్ధికి ఏ వివక్ష లేకుండా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. 
‘రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించారు. 
– రాష్ట్రానికి ఇటీవల 50 ఏళ్ల కాలపరిమితితో రూ.11 వేల కోట్ల వడ్డీ లేని రుణాన్ని కేంద్రం అందించింది. 
– మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించింది. 
– జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా గత 12 ఏళ్లలో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల రుణాలు అందాయి. 
– ఈ ఏడాది రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం రూ.34 వేల కోట్లను కేటాయించింది. 
– గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం భూసేకరణకు సహకరించకపోయినా, కేంద్ర నిధులతోనే ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2 పూర్తి చేశారు. 
– కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్, జహీరాబాద్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌తో పాటు 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..’అని తెలిపారు. 

నాడు కేసీఆర్‌.. నేడు రేవంత్‌ కాలయాపన 
గతంలో మెట్రో ఫేజ్‌–1 అలైన్‌మెంట్‌ మార్పు పేరుతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు ఏళ్లు కాలయాపన చేశారని, నేడు రేవంత్‌రెడ్డి కూడా ఫేజ్‌–2 విషయంలో అదే తీరుతో వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మెట్రో ఫేజ్‌–1 రుణాల విషయం, ఫేజ్‌–2 ప్రాజెక్టు, ఎన్‌ఓసీ సాధించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా.. ఆయనతో పాటు వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సమస్యను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.   

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)