Breaking News

మా జోలికి వస్తే.. మీ తాత వచ్చినా భయపడం

Published on Tue, 07/07/2026 - 12:42

సాక్షి, చెన్నై : కేంద్రంలోని బీజేపీ అనే పెద్ద వాషింగ్‌ మెషీన్‌కు పోటీగా, తమిళనాడులో అవినీతిపరులను శుభ్రం చేయడానికి టీవీకే ఒక చిన్న వాషింగ్‌ మెషీన్‌లా ఆవిర్భవించిందని డీఎంకే యువజన నేత ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. అయితే, ఎలాంటి ఆయుధంతోనైనా సరే.. డీఎంకేని ఎవరూ, ఏ పార్టీ కూడా తాకలేవని  వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, కరుణా నిధి 103వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో  డీఎంకే ఆధ్వర్యంలో  పార్టీ సీనియర్‌ కార్యకర్తల సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో  800 మందికి పైగా డీఎంకే కార్యవర్గ సభ్యులను  ఉదయనిధి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అది ’రీల్స్‌’ ప్రభుత్వం – మంత్రులంతా దొంగలే 
ప్రస్తుత విజయ్‌ ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము సో షల్‌ మీడియాలో రీల్స్‌వేసి అధికారంలోకి వచ్చామ ని ఎంత చెప్పుకున్నా, ప్రస్తుతం వారు చేస్తున్నది కూడా కేవలం రీల్స్‌ వేయడమే తప్ప పాలన కాద న్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరు మంత్రులో ముఖ్య మంత్రికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో పైరసీ  వీసీడీలు అమ్మిన వ్యక్తి, బ్లాక్‌లో సినిమా టిక్కెట్లు అమ్మిన వ్యక్తి, బ్లాక్‌లో లాటరీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తులే తాజాగా  మంత్రులుగా కూర్చున్నారనిధ్వజమెత్తారు. వీరి పేర్లు అందరి కీ తెలుసు, వీరిని ప్రత్యేకంగా శిక్షించాల్సిన అవస రం లేదని, ప్రజలే బుద్ధి చెబుతారని ఎద్దేవా చేశారు. 

మా జోలికి వస్తే.. మీ తాత వచ్చినా భయపడం: 
డీఎంకేను కేవలం రాజకీయ ప్రతీకార చర్యలతో భయపెట్టాలని చూస్తున్నారని ఉదయనిధి మండిపడ్డారు. తమ పార్టీ వర్గాలపై తప్పుడు కేసులు, బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు చేయాలనుకుంటే, తాను  ఒకటే చెబుతున్నానని తమరు  కాదు కదా, తమరి  తాత దిగివచ్చినా సరే ఒక్క డీఎంకే కార్యకర్తను భయట పెట్టలేరని  హెచ్చరించారు. అవినీతి కేసుల్లో ఉన్న అన్నాడీఎంకే నాయకుల్ని టీవీకేలోకి చేర్చుకోవడమే అవినీతి రహిత పాలనా.?. అని ప్రశ్నించారు. 

వచ్చే ఎన్నికల్లో శత్రువు ఎవరో తేల్చుకుంటాం 
గత ఎన్నికల్లో అసలైన శత్రువు ఎవరో తమకు స్పష్టత రాలేదని, అన్నాడీఎంకేను  ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్లామన్నారు. అయితే, ఇక, రాబోయే ఎన్నికల్లో తమకు అసలైన శత్రువు ఎవరో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతామన్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)