Breaking News

దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉద్ధవ్‌ ఠాక్రే ర‌హ‌స్య మీట్‌.. వీడియో వైరల్‌

Published on Thu, 06/27/2024 - 18:13

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్లో భాగంగా తొలిరోజైన గురువారం చిరకాల ప్రత్యర్థులు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే అనుకోకుండా ప్రత్యేకంగా కలిశారు. మాజీ సీఎంలైన ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండ‌గా ఇద్దరూ ఏదో విషయంపై మాట్లాడుకున్నారు.

ఏ విష‌యంపై మాట్లాడుత‌కున్నారో తెలియ‌లేదు కానీ దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య పొత్తు ఉండవచ్చన్న రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.

అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రేను దీని గురించి మీడియా ప్రశ్నించింది. ఆయన, ఫడ్నవీస్‌ ఏం మాట్లాడుకున్నారని అని అడిగింది. ‘ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ మేం లిఫ్ట్ లోనే చేస్తాం’ అని ఠ‌క్రే సరదాగా అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌, తాను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు  1965లో విడుద‌లైన  జబ్ జబ్ ఫూల్ ఖిలే సినిమాలోని ‘నువ్వు తిరస్కరించినా, నీ ప్రేమలో పడ్డా’ అన్న పాత పాట ప్రజలకు గుర్తుకు వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే అలాంటిదేమీ లేదని, అనుఉకోక‌కుండా  తామిద్దరం కలిసినట్లు చెప్పారు.

 మరోవైపు బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య సరదాగా మరో సంభాషణ జరిగింది. ఠాక్రేకు చంద్రకాంత్‌ చాక్లెట్‌ బార్‌ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్ధవ్‌ ఠాక్రే ‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’ అని బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్‌లో తాయిలాలు ప్రకటించే విషయాన్ని ఇలా ప్రస్తావించారు.

కాగా ఈ ప్ర‌భుత్వంలో ఇవే చివ‌రి అసెంబ్లీ స‌మావేశారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఇటీవ‌ల జ‌రిగిన‌ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)ల అధికార కూటమి త‌క్కువ స్థానాలు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. 48 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ 30, ఎన్డీఏ కూటమి 17 స్థానాలు గెలుచుకుంది.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)