శివసేన మోదీ డిగ్రీలా నకిలీ కాదు: ఉద్ధవ్‌ ఠాక్రే

Published on Sat, 04/13/2024 - 09:24

ముంబై:  ప్రధాని నరేంద్ర మోదీ చేసిన నకిలీ శివసేన ఆరోపణలపై శివసేన( ఉద్ధవ్‌) పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కౌంటర్‌ ఇచ్చారు. మరాఠా భూమి పుత్రుల హక్కుల కోసం పోరాడటానికి బాలా సాహేబ్‌ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని అన్నారు. ‘మరాఠా భూమి పుత్రుల హక్కుల పోరాటం కోసం దివంగత నేత బాల్‌ ఠాక్రే శివసేనను స్థాపించారు. శివసేన పార్టీనే నకిలీ అంటే.. నరేంద్ర మోదీకి ఉ‍న్న డిగ్రీ కూడా నకిలీనే’ అని ఉద్ధవ్‌ మండిపడ్డారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి 300 సీట్లను గెలుచుకుందన్నారు. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మహారాష్ట్రలోని ఓ ర్యాలీలో పాల్గొని  ఉద్ధవ్‌ (శివసేన)పై విమర్శలు చేశారు. ఉద్ధవ్‌ శివసేన.. నకిలీ శివసేన పార్టీ అని అన్నారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పార్టీ  డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కాంగ్రెస్‌, నకిలీ శివసేన(ఉద్ధవ్‌) కూడా మహారాష్ట్రలో ర్యాలీల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు’ అని ప్రధాని మండిపడ్డారు.

ఇక..2022లో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసింది. ఏక్‌నాథ్‌ షిండే పలువురు రెబల్‌ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అతనోపాటు వచ్చిన కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. అసలైన శివసేన పార్టీ ఎవరిదని ఉద్ధవ్‌, షిండే వర్గాలు పిటిషన్లు వేశాయి. దీంతో కోర్టు అనుమతిలో ఏక్‌నాథ్‌ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్‌ ప్రకటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)