Breaking News

ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

Published on Mon, 10/14/2024 - 18:58

ముంబై : గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. గ‌తంలో ఉద్ధ‌వ్ ఠాక్రే యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించుకున్నారు. 

తాజాగా, మ‌రోసారి స‌మ‌స్య ఉత్ప‌న్నం కావ‌డంతో అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రిలో చేరార‌ని , డాక్ట‌ర్లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఉద్ధ‌వ్ ఠాక్రే  మే 2016లో లీలావతి హాస్పిటల్‌లో యాంజియోగ్రఫీ ప్రక్రియ చేయించుకున్నారు. అంత‌కుముందు  జూలై 20, 2012న గుండె ఎనిమిది స్టెంట్‌లను అమర్చారు.  

కాగా, శనివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే  బీజేపీపై నిప్పులు చెరిగారు. నేటి ‘హైబ్రిడ్ బీజేపీ’ అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచించాలని అన్నారు.  

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే  రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019లో బీజేపీ హిందుత్వ సంస్కరణపై నమ్మకం లేనందునే ఆ పార్టీతో విడిపోయానని, అయితే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాన్ని తాను ఎప్పటికీ వదులుకోలేదని థాకరే చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)