Breaking News

పొంగులేటి అనుచరులకు షాక్‌.. పాత కేసులపై పోలీసుల నోటీసులు!

Published on Sun, 06/25/2023 - 11:37

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇక, ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే, పొంగులేటి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులను అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ టార్గెట్‌ చేసినట్టు తెలుస్తోంది. 

తాజాగా పొంగులేటి అనుచరులపై పాత కేసులు తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్‌ ప్రధాన అనుచరులు తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ మువ్వా విజయ్‌ బాబుపై పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఓ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ విజయ్‌ బాబు బ్యాంకు కేసును సీఐడీకి అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.  ఈ నేపథ్యంలో పొంగులేటి మద్దతుదారులు స్పందించారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కక్షపూరితంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పొంగులేటి నేడు(ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో చేరికపై రాహుల్‌ గాంధీతో వీరు చర్చించనున్నారు. ఈ క్రమంలో ఖమ్మంపై కాంగ్రెస్‌ పార్టీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీంతో, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అలర్డ్‌ అయ్యింది. సీఎం కేసీఆర్‌ కూడా ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో మాట్లాడుతూ అక్కడి పొలిటికల్‌ సమీకరణాలను తెలుసుకుంటున్నారు. అటు, బీజేపీ కూడా ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తోంది. దీంతో, ఖమ్మంలో పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్‌.. ఆ 70 మంది పరిస్థితేంటి?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)