Breaking News

కాంగ్రెస్‌కు షాక్‌.. అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థుల పోటీ!

Published on Fri, 01/19/2024 - 21:57

కోల్‌కతా: కాంగ్రెస్‌ పార్టీకి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ షాక్‌ ఇచ్చారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి కూటమిలో కీలకమైన భాగస్వామ్య పార్టీగా వ్యవహరిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉ‍న్న మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున బెర్హంపూర్ లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ అధీర్‌ రంజన్‌ చౌదరీ గెలుపొందిన విషయం తెలిసిందే. బెర్హంపూర్‌ సెగ్మెంట్‌లో కూడా టీఎంసీ తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెడుతామని యోచిస్తున్నట్లు సమాచారం.

‘ఇండియా కూటమీ’ లో భాగస్వామ్య పార్టీ అయిన టీఎంసీ.. మొదటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి రెండు సీట్లను ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. అయితే అనూహ్యంగా అన్ని స్థానాల్లో(42) టీఎంసీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఎంసీ తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్‌, ‘ఇండియా కూటమి’లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఎంసీ 22, బీజేపీ18, కాంగ్రెస్‌ పార్టీ 2 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.

చదవండి: ‘జమిలి ఎన్నికలు.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు వ్యతిరేకం’

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)