Breaking News

కేసీఆర్‌ను కేటీఆర్‌ నిర్బంధించారు: టీపీసీసీ చీఫ్‌

Published on Fri, 11/15/2024 - 19:52

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చర్చకు సిద్దమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. పార్మా సిటీ ఒక్కచోట ఉండకూడదనే వికేంద్రీకరణ చేశామని చెప్పారు. లగచర్లలో భూమిలేని వారు అధికారులపై దాడి చేశారని, కేటీఆర్‌ ఉద్దేశపూర్వకంగా దాడి జరిపించాడని ఆరోపించారు. ఫార్ములా వన్‌ రేసులో చేసిన తప్పేంటో కేటీఆర్‌కు తెలుసని, ఆయన తప్పు చేశాడని ఫీలవుతున్నాడు కాబట్టే జైలుకుపోతా అంటున్నాడని తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఫ్యామిలీని జైలుకు పంపడం లేదేంటని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి అధికారులపై పద్దతి ప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రతిపక్షహోదా ఉన్నప్పటికీ.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏడాదిగా బయటకు రావడం లేదన్నారు.  ఆయన ఎక్కడ దాకున్నారని ఆయన ప్రశ్నించారు.

‘కేసీఆర్‌ను కేటీఆర్‌ నిర్బంధించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిన రుణమాఫీ కంటే మేము 9 నెలల్లో ఎక్కువ చేశాం. నిర్బంధ పాలన నుంచి ప్రజా పాలన తీసుకొచ్చాం. అందుకే బీఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ప్రజలు కోరినట్లు పాలన సాగింది కాబట్టే విజయోత్సవాలు చేస్తున్నాం. బీఆర్‌ఎస్‌ హయాంలోని అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయి.

హైడ్రా అనేది హైదరాబాద్‌ నగరానికి ఒక వరం. ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పూర్తిగా బాగు చేస్తే.. వయనాడ్‌లో చోటుచేసుకున్న ఉపద్రవాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మూసీ ప్రక్షాళన అవసరం. పేదలెవరూ నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకుంటుంది’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)