Breaking News

మేం దాడులకు దిగితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పారిపోతారు

Published on Wed, 02/22/2023 - 05:16

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రతిదా­డుల­కు దిగితే బీఆర్‌ఎస్‌ ఎ­మ్మె­ల్యేలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్ప­డతాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కు­మార్‌గౌడ్‌ హె­చ్చ­రించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అవినీతిపై పోస్టర్లు అంటిస్తున్నారన్న కారణంగా వరంగల్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ నేత తోట పవన్‌పై దాడి చేయడం హేయమని మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్ర­హం వ్యక్తంచేశారు.

తోట పవన్‌పై బీఆర్‌­ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అనుచరులు కిరాతకంగా దాడిచేశారని, హత్య చేసేందుకు యత్నించారని, వినయ్‌భాస్కర్‌తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేశ్‌కు­మార్‌ డిమాండ్‌ చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యే­గా గెలిచిన దళిత నాయకుడు సాయన్నకు ప్రభుత్వం గౌరవం ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దళితులంటే గౌరవం లేదని, కనీసం అధికారిక లాంఛనాలతో కూడా సాయన్న అంత్యక్రియలు పూర్తి చేయకుండా చావులో కూడా సాయన్నకు బాధను మిగిల్చారని మహేశ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)