Breaking News

‘ఓటమి భయంతోనే కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి పారిపోతున్నారు’

Published on Thu, 08/24/2023 - 12:58

సాక్షి, వికారాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ దత్తత తీసుకుంటే కొండగల్‌కు ఏం జరిగిందని ప్రశ్నించారు. కొడంగల్‌ ప్రజలను కేసీఆర్‌ మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మీరు చేతితో కొడితే.. ప్రజలు చెప్పుతో కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, రేవంత్‌ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోతామనే భయంతో కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి పారిపోతున్నారు. ఓటమి భయం కేసీఆర్‌ గొంతులో స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారు. నా హయాంలోనే గుడి, బడి, మొత్తం అభివృద్ధి జరిగింది. కొడంగల్‌కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేనే. కొడంగల్‌ నియోజకవర్గానికి 30 సబ్‌స్టేషన్లను తీసుకువచ్చాను. 

బీఆర్‌ఎస్‌ హయాంలో నారాయణపేట్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయకుండా కొడంగల్‌కి అన్యాయం చేశారు. జిల్లాలు పెంచి కొడంగల్‌ను ముక్కలు చెక్కలు చేశారు. రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్.. ఇంకా ఎందుకు తేలేకపోయారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్‌కు నీళ్లు రావు అని స్పష్టం చేశారు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది అంటూ విమర్శలు చేశారు. 

మరోవైపు.. తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. పొత్తుల విషయం కాంగ్రెస్‌ త్వరగా తేలిస్తే బెటర్‌. లెఫ్ట్‌ పార్టీలకు కేసీఆర్‌పై ఉన్న భ్రమలు తొలగిపో​యాయి. ఓటమి భయంతోనే కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు’ అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ఖమ్మంలో పొలిటికల్‌ ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ ప్లాన్‌ ఫలించేనా?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)