Breaking News

మోదీ పాలనలో ప్రమాదంలోకి దేశం

Published on Sat, 11/05/2022 - 03:26

సాక్షి, కామారెడ్డి /నిజాంసాగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో భారతదేశం ప్రమాదంలోకి వెళ్లిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దేశ రక్షణ కోసమే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరుతూ ఈ పాదయాత్ర చేయడం లేదని స్పష్టం చేశారు. మోదీ, అమిత్‌ షా, బీజేపీ పరిపాలనలో చోటు చేసుకుంటున్న అరాచకాలు, దుర్మార్గమైన చర్యల నియంత్రణ కోసం రాహుల్‌ చేపట్టిన ఈ పాదయాత్రకు దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని చెప్పారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మాగి గాయత్రి కర్మాగారం వద్ద రాహుల్‌గాంధీ పాదయాత్రపై ఏర్పాటు చేసిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధానాన్ని ప్రధాని మోదీ పక్కదారి పట్టించారని, తాత్కాలిక అధికారం కోసం మోదీ, అమిత్‌ షాలు ప్రకంపనలు సృష్టిస్తున్నారని రేవంత్‌ విమర్శించారు.

ఆ ప్రకంపనలు దేశం నలుమూలలా కన్పిస్తున్నాయన్నారు. ప్రతిచోటా దాడులు జరుగుతున్నాయని, దాడులకు గురవుతున్న దళితులు అభద్రతా భావానికి గురవుతున్నారని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, దామోదర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సుదర్శన్‌రెడ్డి, వి.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)