Breaking News

కేటీఆర్‌ అరెస్ట్‌ తప్పదు.. కవిత పంచాయతీ వేరే అంశం: టీపీసీసీ చీఫ్‌

Published on Thu, 09/25/2025 - 13:00

సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీదే విజయమని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పుకొచ్చారు. సర్వేలో ఎవరు ముందుంటే వారికే సీటు అని క్లారిటీ ఇచ్చారు. కల్వకుంట్ల కవితది ఆస్తుల పంచాయతీ.. ఆమెకు ప్రజల్లో ఏం ఇమేజ్‌ ఉందని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ అరెస్ట్‌ తప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏడాది కాలంలో ఎంతో పని చేశాం. గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం బాగా జరుగుతోంది. సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం. జూబ్లీహిల్స్‌లో సామాజికవర్గం కాకుండా గెలుపు లక్ష్యం. నియోజకవర్గంలో సర్వేలు జరుగుతున్నాయి. సర్వేల్లో ఎవరు ముందుంటే వారికే టికెట్‌ దక్కుతుంది. అక్టోబర్ నాలుగో తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే ఒక్కరోజులో బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపొచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది.

కవితది ఆస్తుల పంచాయతీ. కాంగ్రెస్‌తో కవితకు ఏంటి సంబంధం. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉంది?. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు, అందరి వాయిస్‌లు రికార్డు చేశారు. నాది, రేవంత్ రెడ్డిది రెండున్నర ఏళ్ల నుంచి గత ప్రభుత్వం రికార్డు చేసింది. నేను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియో సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చింది. జియో సంస్థకు రాసిన లేఖ కూడా దొరికింది. ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు. క్లియర్ ఆధారాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)