Breaking News

‘అందుకే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు’

Published on Sat, 08/09/2025 - 16:14

హైదరాబాద్‌: బీజేపీ-కాంగ్రెస్‌ రెండు ఒకటేనని, అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నత్తనడకన సాగుతుందన్న కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కౌంటరిచ్చారు. అసలు బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. సికింద్రాబాద్‌ ఎంపీ టిక్కెట్‌ను ఒక బీసీ నుంచి, రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ నుంచి కిషన్‌రెడ్డి లాక్కున్నారన్నారు.  

ఇక జూబ్లీహిల్స్‌శాసనసభ  ఉప ఎన్నికలో భాగంగా తమ అభ్యర్థి గురించి ఇంకా సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. నోటిఫికేషన్‌ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారన్నారు.  లోకల్‌ బాడీ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద నడకేనని మహేష్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. 

అదే మా తపన
లోకల్‌ బాడీ ఎన్నికల అంశానికి సంబంధించి కాంగ్రెస్‌ మంచి సమన్వయంతో ఉందన్నారు మహేస్‌ గౌడ్‌. రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలనేది తమ తపన అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లను తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జనహిత పాదయాత్ర తనదని,కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా ఆ పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ది కాదన్నారు. తమ ఏఐసీసీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఆమోదించాకే ఆ పాదయాత్రను ప్రారంభించామన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)