‘బండి సంజయ్‌ సహా బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు’

Published on Mon, 08/25/2025 - 10:28

సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే, బీహార్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుంది అంటూ జోస్యం చెప్పారు.

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణలో బండి సంజయ్ సహా, బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. మాకు తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయి. ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాస్తాం. మా నిజామాబాద్ జిల్లాలోనూ దొంగ ఓట్లున్నాయి. అది నేను నిరూపిస్తాను. మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు నమోదు చేశారు.

నిజామాబాద్‌లోనూ మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయి. కరీంనగర్‌లోనూ ఓ డబల్ బెడ్ రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఓట్లు చోరీ చేసే అవసరం కేవలం బీజేపీకే ఉంది. బీహార్ ఎన్నికల్లోనూ అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజల్ని చైతన్యపర్చేందుకే రాహూల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్‌ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. బీహార్‌లో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)