Breaking News

‘టార్చ్‌లైట్‌’ ఎలా వచ్చింది...

Published on Sun, 11/08/2026 - 11:44

అనకాపల్లి: పెదరొడ్డేపల్లిలో శనివారం జరిగిన ఓట్ట లెక్కింపుల్లో  సంబంధం లేని టార్చిలైట్‌ గుర్తు బ్యాలెట్‌ పత్రంలో ప్రత్యక్షమయింది.  వివరాలిలా ఉన్నాయి. మండలంలో నలుగురు జెడ్పీటీసీ అభ్యర్థులు  పోటీ చేశారు. ఈ నెల 5న పోలింగ్‌ కూడా జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రం అయిన పెదబొడ్డేపల్లి  డాన్‌బాస్కో డిగ్రీ కళాశాలలో గల స్ట్రాంగ్‌రూముకి  పోలీసు బందోబస్తుతో బ్యాలెట్‌ బాక్సులు అదే రోజు చేరాయి. స్ట్రాంగ్‌రూంకు సీల్‌ వేయడం జరిగింది. 

శనివారం ఓట్ల లెక్కింపు కోసం బ్యాలెట్‌ బాక్సులను  లెక్కింపు కేంద్రానికి తీసుకొచ్చి కౌంటింగ్‌ చేపట్టినపుడు బ్యాలెట్‌ పత్రాల్లో టార్చ్‌లైట్‌ గుర్తు ఉన్న పత్రాలు బయటపడ్డాయి. ఏజెంట్‌ ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కౌటింగ్‌ అధికారుల వద్దకు వచ్చి సంబంధం లేని టార్చిలైటు గుర్తు  బ్యాలెట్‌లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. ఈ తప్పిదం ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ కౌంటింగు అధికారులు ఆర్వో దృష్టికి తీసుకెళతామని సమాధానపరిచారు. జెడ్పీటీసీ అభ్యర్థి మాత్రం దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని,  ఇది అధికార పార్టీ నాయకులు, వారికి తొత్తులుగా పని చేస్తున్న అధికారుల తప్పిదమేనన్నారు.    

ఇదీ చదవండి: కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)