Breaking News

బాధ్యత లేని బాబు సర్కార్‌పై పోరాటానికి సిద్ధం: టీజేఆర్‌ సుధాకర్‌

Published on Wed, 10/02/2024 - 15:15

సాక్షి, తాడేపల్లి: ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతామన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు. బాధత్యలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్‌ జగన్‌తో అనుబంధ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బూత్‌ లెవల్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని వైఎస్‌ జగన్‌ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతాం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నాం. ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తాం.

బాధ్యతలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని వైఎస్‌ జగన్ పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా పార్టీ నిర్మాణం చేస్తాం. ప్రజలకు అండగా నిలబడతాం. అన్ని స్థాయిల్లోనూ కార్యవర్గాలను నియమిస్తాం. అందరికీ ఐడీ కార్డులు కూడా ఇస్తాం. ఎవరెవరు ఎలా పని చేస్తున్నదీ సమీక్షలు చేస్తాం. చెదిరిపోయిన వాలంటీర్లను సమీకరిస్తాం. ప్రజల గొంతుకగా రానున్న రోజుల్లో పని చేస్తాం. 2029లో మళ్ళీ వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం. కమిటీ నిర్మాణాల అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభిస్తాం.  ఈనెల 16, 17న వర్క్‌షాప్ నిర్వహిస్తాం. జిల్లా అధ్యక్షులతో కలిసి అన్ని విభాగాల నేతలు ఈ వర్క్‌షాపునకు హాజరవుతారు’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్‌..

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)