ముగిసిన కొలికపూడి డెడ్‌లైన్‌.. బోసుబొమ్మ సెంటర్‌లో హైటెన్షన్‌

Published on Sat, 03/29/2025 - 11:57

ఎన్టీఆర్, సాక్షి: సవాళ్లు , ప్రతిసవాళ్లతో వేడెక్కిన తిరువూరు టీడీపీ రాజకీయం.. ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చిన డెడ్‌లైన్‌ శనివారం ముగిసిపోయింది. దీంతో తర్వాత ఏం జరగనుందా? అనే చర్చ నడుస్తోంది. 

టీడీపీ నేత, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిపై లైంగిక ఆరోపణలు రావడంతో.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ అధిష్టానానికి 48 గంటల డెడ్‌లైన్‌ విధించారాయన. శనివారం ఆ గడువు కాస్త ముగిసిపోయింది. దీంతో రాజీనామా చేస్తారా? అనేది చూడాలి. 

మరోవైపు.. రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి తనను టార్గెట్ చేశాడని రమేష్ రెడ్డి ఆరోపించడం పార్టీ కేంద్ర కార్యాలయంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచే కొలికపూడి తీరుపై అసంతృప్తిగా ఉన్న అధిష్టానం.. ప్రత్యేకంగా పార్టీ కేడర్‌ ద్వారా తిరువూరు నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై వేటు పడవచ్చనే చర్చా నడుస్తోంది. 

దీంతో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బహిరంగ చర్చకు రావాలంటూ ప్రత్యర్థులకు కొలికపూడి సవాల్ విసరగా.. పార్టీ కేడర్‌ అందుకు ధీటుగా స్పందించింది. తాడే పేడో తేల్చుకుందాం రమ్మంటూ.. బోసుబొమ్మ సెంటర్లో చర్చకు కొలికపూడిని ఆహ్వానించింది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ కేడర్ సవాళ్ల నేపథ్యంలో.. బోసుబొమ్మ సెంటర్లో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే.. సవాల్ విసిరిన కంచెపోగు ప్రసాద్ , డేవిడ్ లను హౌస్ అరెస్ట్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో ముదిరిన వర్గపోరు

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)