ప్రధానికి రాసిన లేఖలో వాస్తవాల్ని పరిశీలించండి: వైఎస్‌ జగన్‌

Published on Mon, 09/23/2024 - 12:12

గుంటూరు, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ మరింత మంది కేంద్ర మంత్రులను ఆ లేఖకు ట్యాగ్‌ చేశారు.

తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్‌ ఖాతా ద్వారా కోరారు.  శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు. వాళ్లందరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయని, భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయని జగన్‌ తన లేఖలో రాశారు.

ఇంకా ఆ లేఖలో.. ఏపీలో ప్రభుత్వం 100  రోజులు పూర్తైంది. తమ పాలన అద్భుతంగా ఉందంటూ టీడీపీ గొప్పలు చెప్పుకుంటోంది కానీ ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని జగన్‌ తన లేఖలో కుట్ర కోణాన్ని ప్రస్తావించారు. 

ఇదీ చదవండి: చంద్రబాబు స్వార్థ రాజకీయం.. జరగని తప్పుపై 'రాద్ధాంతం'

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)