Breaking News

శ్రీకాకుళం అభ్యర్థిని మార్చాల్సిందే

Published on Thu, 03/28/2024 - 08:10

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజెపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న గొండు శంకర్‌ను మార్చి, గుండ లక్ష్మీదేవికి టిక్కెట్‌ కేటాయించాల్సిందేనని జోనల్‌ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం క్యాడర్‌ ఆల్టిమేటం జారీ చేసింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జోనల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డి అరసవల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసానికి చేరుకొని వారితో సమావేశమయ్యారు. అనంతరం క్యాడర్‌తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు గుండ దంపతులను తీసుకొని రమ్మన్నారని ఆ విషయాన్ని వారిద్దరికీ వివరించారు.

దీనికి గుండ దంపతులు స్పందిస్తూ చంద్రబాబుతోనే మాట్లాడుతామని, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌తోనైతే మాట్లేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరో రెండు మూడు రోజుల్లో వారు చంద్రబాబునాయుడును కలిసేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. దీనిపై నగర తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏది ఏమైనా శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్‌ లక్ష్మీదేవికి కేటాయించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. నగరానికి చెందిన 50 డివిజన్లలో 45 డివిజన్లకు చెందిన ఇన్‌చార్జులంతా గుండ లక్ష్మీదేవి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.

రెండేళ్లుగా క్రమశిక్షణ తప్పిన అసమ్మతి నేతకు టిక్కెట్‌ కేటాయించడంపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పరిస్థితిని చంద్రబాబునాయుడుకు వివరించి లక్ష్మీదేవికి టిక్కెట్‌ వచ్చేలా చూడా లని కోరారు. దీనికి సమాధానంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మీ ఆవేదన తనకు అర్థమైందని చంద్రబాబు వద్దకు గుండ దంపతులను తీసుకెళ్లడం వరకే తన బాధ్యతని వివరించారు. టికెట్‌ ఇస్తే గుండకే ఇవ్వాలని, యూత్‌ కోటా అనుకుంటే వారి కుమారుడికి ఇవ్వాలే తప్ప గొండు శంకర్‌కి కన్ఫర్మ్‌ చేస్తే తాము ఒప్పుకోబోమని కార్యకర్తలు అన్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)