Breaking News

AP,TG: చంద్రబాబు ఇళ్ల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన

Published on Tue, 03/19/2024 - 13:44

సాక్షి, హైదరాబాద్‌/గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకున్న నివాసాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్‌ పంచాయితీలతో పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ఆ నివాసాల దగ్గర ఆందోళనకు దిగారు. విజ్ఞప్తి చేసేందుకు వస్తే తమను పార్టీ అధినేతను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని నినాదాలు చేస్తున్నారు.

ఇటు జూబ్లీహిల్స్‌ నివాసం.. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ రాష్ట్రం దాటి హైదరాబాద్‌కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇంఛార్జి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు తరలి వచ్చారు. ఆలూరులో పాతికేళ్లుగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారని.. ఈసారైనా గెలిపించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో సుజాతమ్మకు అనుకూల నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

అటు ఉండవల్లి నివాసం వద్ద.. చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళనకు దిగారు. కదిరి టిక్కెట్ అత్తర్ చాంద్ భాషాకే ఇవ్వాలని పట్టుబట్టారు. ఈపాటికే కదిరి టికెట్‌ను టీడీపీ అధిష్టానం కందికుంట ప్రసాద్ సతీమణి యశోద దేవికి టీడీపీ కేటాయించింది. అయితే.. చాంద్‌భాషా ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడుతున్నారని.. అన్యాయం చేయొద్దని ఆయన అనుచరులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ కదిరి టికెట్‌ కుదరని పక్షంలో.. హిందూపురం ఎంపీ టికెట్‌ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం నో అంటోంది. 

ఈ క్రమంలో.. ఇవాళ ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కదిరి టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చాంద్‌భాషాకి టికెట్‌ ఇస్తే టీడీపీ తప్పక గెలుస్తుందని లోకేష్‌తో కార్యకర్తలు చెప్పగా.. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఏం చేశారో మాకు తెలుసు. గొడవలొద్దు. అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని లోకేష్‌ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కార్యకర్తలు తమ ఆందోళన కొనసాగిస్తున్నట్లు సమాచారం. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)