Breaking News

నా కూతురు అల్లుడిని నదిలో పడేయండి: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Sat, 09/07/2024 - 15:56

ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ(అజిత్‌పవార్‌) సీనియర్‌ నేత ధర్మారావు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురు భాగ్యశ్రీ శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. శనివారం అహేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడుతూ.. నమ్మక ద్రోహానికి పాల్పడితే తన కూతురు భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్‌ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పడేయాలని వ్యాఖ్యానించారు.

అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు ‘జన్సన్మాన్‌ యాత్ర’ సందర్భంగా ఎన్సీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సమక్షంలోనే చేయడం గమనార్హం. ‘పార్టీని విడిచివెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఎన్నో ఫిరాయింపులను ఎదుర్కొన్నారు. 

ఇప్పుడు శరద్ పవార్‌కు చెందిన నాయకులు నా కుటుంబాన్ని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు, కూతురిని నమ్మవద్దు. వాళ్లు నన్ను విడిచిపెట్టారు. అలాంటి వారిని సమీపంలోని ప్రాణహిత నదిలో తోసేయాలి, వారు నా కుమార్తెను తమ వైపుకు తిప్పుకొని  సొంత తండ్రికి వ్యతిరేకంగా ఆమెను తయారు చేస్తున్నారు. 

తండ్రికి కూతురు కాలేకపోయిన అమ్మాయి మీకు ఏం అవుతుంది? దాని గురించి మీరు  ఆలోచించాలి. ఆమె నీకు ఏం న్యాయం చేస్తుంది? వారిని నమ్మవద్దు. రాజకీయాల్లో నేను  కుమార్తె, సోదరుడు సోదరిలా చూడను. ’అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న ధర్మారావు ఆత్రమ్‌.. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహేరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని చూస్తున్నారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)