Breaking News

మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్‌ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Published on Sun, 10/27/2024 - 06:56

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన మహావికాస్ అఘాడి, మహాయుతి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా  కాంగ్రెస్‌ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం మూడు జాబితాలతో కలిపి కాంగ్రెస్‌ ఇప్పటివరకు 87 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

కాంగ్రెస్ మూడో జాబితాలో డిగ్రాస్ నుంచి మాణిక్‌రావ్ ఠాక్రేను పార్టీ బరిలోకి దించింది. బాంద్రా వెస్ట్‌ నుంచి ఆసిఫ్‌ జకారియా, అంధేరీ వెస్ట్‌ నుంచి సచిన్‌ సావంత్‌లకు పార్టీ టిక్కెట్‌ ఇచ్చింది. మాలెగావ్ సెంట్రల్ నుండి కాంగ్రెస్ ఎజాజ్ బేగ్‌కు అవకాశం కల్పించింది. అయితే సమాజ్ వాదీ పార్టీ ఈ సీటు కోసం పట్టుపడుతున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ తన రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, తొలి జాబితాలో 48 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

మరోవైపు మహా వికాస్ అఘాడి  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకానికి సంబంధించిన ఫార్ములాను ప్రకటించింది. దీని ప్రకారం శివసేన (యూబీటీ), కాంగ్రెస్- ఎన్‌సీపీ (ఎస్‌పీ) చెరో 85 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కొన్ని సీట్ల విషయంలో ఇంకా ప్రతిష్టంభన నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.

ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)