Breaking News

కేసీఆర్‌ మీటింగ్‌కు డుమ్మా.. ఆ ఎమ్మెల్యే జంపింగ్‌ కన్‌ఫర్మ్!

Published on Mon, 03/04/2024 - 15:38

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం మొదలైనట్లేననా?. బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్‌కు.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు గైర్హాజరు కావడతో ఈ అంశం తెరపైకి వచ్చింది. విశేషం ఏంటంటే..ఆ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన ఒక్కరే కావడం. 

సోమవారం బీఆర్‌ఎస్‌ అధికార భవనం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలపై లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. అయితే ఈ మీటింగ్‌కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం తరఫున బీఆర్‌ఎస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనే.

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా తెల్లం వెంకట్రావు మాత్రం వారితో వెళ్లలేదు. మరోవైపు ఇటీవలే కుటుంబంతో సహా ఆయన టీపీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో..  ఆయన పార్టీ మారబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ పరిణామాలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు స్పందించాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. గతంలోనూ ఆయన సీఎం రేవంత్‌ను కలవగా.. అప్పుడు ఇలాంటి ఊహాగానాలే వినిపించాయి. అయితే ఆ సమయంలో ఆయన ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాజా పరిణామాలతో వెంకట్రావు పార్టీ మారతారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)