Breaking News

నేను బీఆర్ఎస్‌లో చేరడం లేదు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Published on Wed, 07/31/2024 - 15:32

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం:  తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాల్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు.  తాను పార్టీ మారడం లేదని, ఒకవేళ కాంగ్రెస్‌ను కాదని బీఆర్‌ఎస్‌లో చేరితో అది ప్రాణ త్యాగమే అవుతుందని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌తోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుంది. భద్రాచలం అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరాను. అదే నమ్మకంతో కాంగ్రెస్ లోనే ఉంటా. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరనున్నానేది అవాస్తవమని తెలిపారు. భద్రాచలం ప్రజలు సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.    

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అయితే లోక్‌సభ ఎన్నికల ముందు తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ వీడి సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

తాజాగా ఆయన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షనేత, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఛాంబర్‌కి వెళ్లారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేక్, మల్లారెడ్డిలు ఉన్నారు. కేసీఆర్‌ ఛాంబర్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అనంతరం తెల్లం వెంకటరావు, ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డిలు కలిసి బయటకు వెళ్లడంతో..తెల్లం వెంకట్రావు సైతం తిరిగి బీఆర్‌ఎస్‌ చేరనున్నారనే సోషల్‌ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాను కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరడం లేదని స్పష్టత ఇచ్చారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)