Breaking News

పథకాల పేర్లతో మోసం చేస్తున్నారు

Published on Tue, 02/14/2023 - 01:37

జనగామ: రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అంటే ఏంటో చూపించిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని విమర్శించే సీఎం కేసీఆర్‌... బొంకుడు మాటలు మాట్లాడేది ఎవరో చెప్పాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా విమర్శించారు. వైఎస్‌ఆర్‌పై అసెంబ్లీలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో సోమవారం జరిగిన సభలో ఆమె మాట్లాడారు.

పథకాల పేరు చెబుతూ... ప్రజలను మోసం చేసేది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33 ప్రాజెక్టుల నిర్మాణం చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి బొంకుడు మనిషి అయ్యారా? అటువంటి బొంకుడు మాటలు చెప్పే అలవాటు నీకే ఉందని కేసీఆర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ దేవుడిగా నిలిచిపోతే... కేసీఆర్‌ను దెయ్యమని పిలుచుకుంటున్నారన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిది పాదయాత్రనో.. దొంగయాత్రనో అర్థం కావడంలేదని విమర్శించా రు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి, కేసీఆర్‌ చేతిలో పిలకగా మారిన రేవంత్‌.. ప్రజల గురించి  మాట్లాడతాడంటే మనం నమ్మొచ్చా అని ప్రశ్నించారు. షర్మిల వెంట నేతలు ఏపూరి సోమన్న, జిల్లా అధ్యక్షుడు గౌరబోయిన సమ్మయ్య ఉన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)