ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
Breaking News
తెలంగాణ ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారు: తరుణ్ చుగ్
Published on Sat, 12/31/2022 - 08:25
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కుటుంబ పాలన, అహంకారం, అవినీతి, దోపిడీతో తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారని, కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ చరిత్రలో కలిసిపోతుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా బీజేపీ పోరాడుతోందని, చాలావేగంగా దూసుకుపోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబపాలనతో ప్రజలు కేవలం బాధపడటమే కాకుండా తీవ్రంగా ద్వేషిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌గా టీఆర్‌ఎస్ మారినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.
చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్‌ఎం పోస్టుల భర్తీ
Tags : 1