Breaking News

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

Published on Mon, 10/06/2025 - 16:37

సాక్షి, హైదరాబాద్‌: బిహార్ ఎన్నికలతో పాటు  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక  పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 14న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 13 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరుకు గడువు ఇచ్చింది. ఈ నెల  22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. జూబ్లీహిల్స్‌ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్‌ భార్య సునీతను బరిలోకి దించిన బీఆర్‌ఎస్‌.. సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది.  ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు.

వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు, 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.



 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)