Breaking News

కాంగ్రెస్‌లో అలజడి.. పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ!

Published on Sat, 02/01/2025 - 10:25

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి నెలకొన్నట్టు తెలుస్తోంది. తాజాగా పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్‌ సమీపంలోని ఓ హోటల్‌లో వీరంతా సమావేశం అయ్యారు. అయితే, ఓ కేబినెట్‌ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై వీరు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది.

ఇక, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు మంత్రులతో సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సీఎం భేటీ అవనున్నారు. అయితే, అధికారులు లేకుండా కేవలం మంత్రులతో సీఎం భేటీ కొనసాగే అవకాశముంది. దీంతో రాజకీయపరమైన చర్చ జరుగుతుందని టాక్ వినిపిసస్తోంది. ఈ నేపథ్యంలో మేజర్ పొలిటికల్ డెసిషన్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు.. సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ నేతలు పెట్టిన పోల్‌ అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ పెట్టిన పోల్‌.. ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది. 70 శాతం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, 30 శాతం కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఓట్లు పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోల్‌ రావడం హస్తం నేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్‌ నేతలు దిక్కులు చూస్తున్నారనే చర్చ సైతం నడుస్తోంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై నిన్ననే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విరుచుకుపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు. నాలుగు రోజులు కానీయ్‌ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. కాంగ్రెస్‌ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి. అలాగే, ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ   హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సిందే అని కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో, హస్తం నేతలు బీఆర్‌ఎస్‌ పంచన చేరే అవకాశాలు సైతం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)