Breaking News

మరి మీ ఎంపీలు కూడా ఓట్‌ చోరీతోనే గెలిచారా?: బీజేపీ

Published on Mon, 08/25/2025 - 15:30

నిజామాబాద్:  తెలంగాణలో సైతం ఓట్‌ చోరీ జరిగిందంటూ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ చందర్ రావు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. మహేష్‌ కుమార్‌ ఓట్‌ చోరీ అంటున్నారు కదా.. ఇది ఓట్‌ చోరీ కాదు.. రాహుల్‌ గాంధీ బ్రెయిన్‌ చోరీ అంటూ మండిపడ్డారు. ఏ ఓటర్‌ లిస్టుతో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిందో అదే ఓటర్‌ లిస్ట్‌తోనే బీజేపీ కూడా గెలిచిందన్నారు.  ఈరోజు(సోమవారం, ఆగస్టు 25) నిజామాబాద్‌ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రామ్‌ చందర్‌రావు.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 

ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో ఓట్‌ చోరీ జరిగిందనే అంశాన్ని ఇక్కడ రామ్‌ చందర్‌రావు ప్రస్తావించారు. మరి కాంగ్రెస్‌ ఎంపీలు సైతం దొంగ ఓట్లతో గెలిచారా? అంటూ ప్రశ్నించారు. ‘ ముస్లింలకు రిజర్వేషన్‌లు పెంచి బీసీల రిజర్వేషన్‌లు తగ్గించే కుట్ర కాంగ్రెస్‌ చేస్తోంది. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరతకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. 

దీనిపై మంత్రులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, సృష్టిస్తున్న కృత్తిమ కొరత. రాష్ట్రం లో కాంగ్రెస్ నేతలు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా సమస్య పై కాంగ్రెస్ పార్టీ రైతులను రెచ్చ కొడుతుంది. ఓటమి భయం తో.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం భయ పడుతుంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు..ఈ రెండు పార్టీలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయటం మామూలు విషయం కాదు’ అని రామ్‌ చందర్‌ రావు స్పష్టం చేశారు.

కాగా, నిన్న(ఆదివారం, ఆగస్టు 24) టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్‌ గెలిచేవారు కాదు. బండిసంజయ్‌ బీసీ కాదు.. దేశ్‌ముఖ్‌. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)