Breaking News

టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

Published on Mon, 06/02/2025 - 07:57

సాక్షి, ఇబ్రహీంపట్నం: ఏపీలో అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆత్కూరుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది కూటమి ప్రభుత్వ తీరుకు విసుగు చెంది ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పటాపంచల సాంబశివరావు, పటాపంచల గోపి, గంగుల నాగరాజు, గంగుల బాలాజీ, గంగుల వెంకట్రావు, గంగుల రమేష్‌ తదితరులకు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ..‘కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం. మైలవరం నియోజకవర్గంలో జూన్ నాలుగో తేదీన  జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

జూన్ 4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందన్నారు.  జి.కొండూరు మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ జడ రాంబాబు, ఆత్కూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగుల తిరుపతిరావు అధ్యక్షతన  వైఎస్సార్‌సీపీలో చేరికలు శుభపరిణామమని అన్నారు.  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)