Breaking News

సామాజిక న్యాయానికి పాతర.. ఇదీ బాబు బండారం

Published on Sun, 03/17/2024 - 08:56

సాక్షి, అమరావతి: బడుగు, బలహీనవర్గాల కోసమే టీడీపీ పుట్టిందని, సామాజిక న్యాయమని బాబు పదే పదే ఊదరగొడుతుంటారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఇతర పదవుల పంపకాల్లో ఆయన ఎప్పుడూ అగ్రవర్ణాల పక్షమే ఉంటారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనతో బాబు సామాజిక బండారం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఈసారీ బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదని అభ్యర్థుల ఎంపిక రుజువు చేసింది.

రెండు విడతలుగా 128 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు సామాజిక న్యాయానికి పాతరేశారు. తన సొంత సామాజికవర్గానికి, ధన బలం, కండ బలం ఉన్న వారికి సీట్లు కట్టబెట్టి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను చిన్న చూపు చూశారు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ సగం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చి తమ ప్రాధాన్యం బడుగు, బలహీన వర్గాలేనని చాటి చెప్పింది.

కానీ తమది బీసీల పార్టీ అని ప్రచారం చేసుకునే బాబు మాత్రం వారికి వెన్నుపోటు పొడిచారు. ప్రకటించిన 128 సీట్లలో ఓసీలకు 72 సీట్లు కేటాయించి, బీసీలకు మాత్రం 24 సీట్లతో సరిపెట్టారు. మొదటి జాబితాలో 18, రెండో జాబితాలో 6 సీట్లను బీసీ వర్గాలకు ఇచ్చారు. దీనినిబట్టి ఆయన వారిని పల్లకీ మోసే బోయీలుగానే చూస్తున్నారని మరోసారి తేట­తెల్లమైంది. మరోవైపు తన సొంత సామాజికవర్గానికి 28 సీట్లు ఇచ్చుకున్నారు. అంటే సొంత సా­మా­జికవర్గానికి ఇచ్చినన్ని సీట్లు కూడా జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు ఇవ్వలేదు. కాపులకు మరీ హీనంగా 8 సీట్లతో సరిపెట్టారు.

అదే సమయంలో రెడ్డి సామాజికవర్గానికి 28 సీట్లు ఇచ్చారు. మొత్తంగా సీట్ల కేటాయింపులో బాబు తన సొంత సామాజికవర్గానికి, ఓసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు 43 సీట్లు కేటాయించిన చంద్రబాబు ఈసారి సగానికి సగం తగ్గించి, పార్టీ­లో వారి ప్రాధాన్యత ఏమిటో చెప్పేశారు. ఎస్సీలకు 25, ఎస్టీలకు 4 సీట్లను రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు.

మైనారిటీలకు తప్పదన్నట్లు మూడు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మహిళలకూ ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వలేదు. మహిళలకు ఇచ్చింది 17 సీట్లు మా­త్రమే. బాబు సా­మా­జిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చినట్లు సీట్ల కేటా­యింపు స్పష్టంగా చెబుతోందని విశ్లేç­Ùకులు అంటున్నారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని 144 సీట్ల­లో పోటీ చేస్తున్న బాబు ఇంకా 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 

ఇదీ చదవండి: నాడు కత్తుల కొలిమి– నేడు పొత్తుల చెలిమి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)