మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి

Published on Fri, 02/07/2025 - 20:42

సాక్షి,ఎన్టీఆర్‌జిల్లా:ఎప్పుడూ వివాదాల్లో ఉండే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గురువారం(ఫిబ్రవరి 6) తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త పల్లికంటి డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో డేవిడ్‌ చెప్పడం సంచలనమైంది. 

‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశా. కొలికపూడి దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ దళితుడినైన నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. నాలాంటోళ్లు ఎంతో మంది పైకి చెప్పుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే వేధింపులతో ఇక బతకడం అనవసరం. నా చావుతోనైనా తిరువూరు పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’అని సెల్ఫీ వీడియోలో డేవిడ్‌ విజ్ఞప్తి చేశాడు. 

తన కుటుంబానికి చంద్రబాబే న్యాయం చేయాలని కోరాడు. ప్రస్తుతం డేవిడ్‌ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కొలికపూడిపై ఇటీవల సొంత పార్టీలో ఫిర్యాదులు ఎక్కువవడంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా ఆయనను సంజాయిషీ కోరింది. గతంలో దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)