Breaking News

Delhi: చంద్రబాబు, పవన్‌ గప్‌చుప్‌.. అసలేం జరిగింది?

Published on Sat, 03/09/2024 - 12:59

సాక్షి, ఢిల్లీ: ఎట్టకేలకు చంద్రబాబుకు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షాతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. వీరు ముగ్గురు దాదాపు గంటపాటు పొత్తులపై చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ, చివరకు ఎలాంటి ప్రకటనా వెల్లడించకపోవడం గమనార్హం. 

కాగా, అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌ భేటీ ముగిసిన అనంతరం ఎలాంటి సంయుక్త పొత్తు ప్రకటన వెలువడలేదు. వీరి భేటీపై ప్రకటన చేయకుండా ఎవరికి వారే విడివిడిగా వెళ్లిపోయారు. అయితే, వీరి భేటీ గురించి మాత్రం టీడీపీ కొన్ని లీకులు ఇస్తోంది. మూడు పార్టీల పొత్తులో భాగంగా జనసేన-బీజేపీకి కలిపి ఎనిమిది పార్లమెంట్‌ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్టు టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జనసేనకు కేటాయించిన సీట్లలోనే చంద్రబాబు కోత పెట్టినట్టు తెలుస్తోంది. 

ఇక, టీడీపీ మాత్రం 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. ఇదే సమయంలో అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చామని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కాగా, పొత్తులపై వీరు ఎప్పుడు స్పందిస్తారో వేచిచూడాలి. 

త్యాగానికి జనసేన రెడీ..
కూటమి పొత్తులో భాగంగా పవన్‌ కల్యాణ్‌ మరో త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. జనసేనకు ఇచ్చిన మూడు పార్లమెంట్‌ స్థానాల్లో ఒక్క స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన కేవలం అనకాపల్లి, మచిలీపట్నం నుంచి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, ఈ రెండు స్థానాల్లో కాకినాడలో పవన్‌ కల్యాణ్‌, మచిలీపట్నం నుంచి బాలశౌరీ పోటీ నిలిచే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ పెద్దల సూచనల మేరకు పవన్‌ కల్యాణ్‌ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

రఘురామకు చేదు అనుభవం..
ఇదిలా ఉండగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చేదు అనుభం ఎదురైంది. చంద్రబాబు, పవన్‌ తమ వెంట రఘురామను అమిత్‌ షా వద్దకు తీసుకువెళ్లలేదు. దీంతో, సిబ్బంది కూడా ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనను లోపలికి అనుమతించాలని కాల్స్‌ మీద కాల్స్‌ చేశారు. అయినా కూడా రఘురామను లోపలికి అనుమతించలేదు. ఇక చేసేదేమీ లేక వారు బయటకు వచ్చేంత వరకు రఘురామ గేటు బయలే నిలబడ్డాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)