పిడుగురాళ్లలో పరాకాష్టకు టీడీపీ నేతల అరాచకం

Published on Sun, 02/16/2025 - 20:49

సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో టీడీపీ నేతల అరాచకం  పరాకాష్టకు చేరింది. బరితెగించిన ఆ పార్టీ నేతలతో మున్సిపల్‌ అధికారులు కుమ్మక్కయ్యారు. రేపు(సోమవారం) మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పది రోజులుగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులను బెదిరించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మునీరా దంపతుల ఇళ్లను మున్సిపల్‌ అధికారులు కూల్చేశారు. దగ్గరుండి మరి.. మునీరా దంపతుల ఇళ్లను టీడీపీ నాయకులు కూల్చివేయించారు.

కాగా, ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్‌ లేకపో­యినా కూడా పిడుగురాళ్ల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్ని­కయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్‌ చైర్మన్‌ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది.

తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయి­తే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వ­హించాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్‌ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్‌ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తు­న్నారు.

 

 

 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)