Breaking News

జెండా మోస్తూనే ఉండాలా!

Published on Tue, 07/21/2026 - 08:24

సాక్షి, మదనపల్లె: టీడీపీ కోసం జీవితాంతం జెండా మోస్తూనే ఉండాలా, కనీస గౌరవం, గుర్తింపు ఎందుకివ్వరని ఆ పార్టీ సీనియర్‌ నేతలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ.జనార్దనరెడ్డిని ప్రశ్నించారు. సోమవారం మదనపల్లెలోని పార్లమెంట్‌ పార్టీ కార్యాలయంలో మంత్రితో నియోజకవర్గానికి చెందిన 30 మంది ముఖ్యనేతలు సమావేశమై తమ గోడు వెల్లబోసుకున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు..పార్టీ పార్లమెంట్‌ అధ్యక్షుడు ప్రసాద్‌ ఈ సమావేశంలో కొద్దిసేపు ఉండి వెళ్లిపోగా, ప్రధాన కార్యదర్శి పఠాన్‌ ఖాదర్‌ ఖాన్‌ ఉన్నారు. ఈ సందర్భంగా నేతలు ఒక్కొక్కరు తమ గళం విప్పారు.

 అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పార్టీకోసం పనిచేసిన వారిని గుర్తించి పార్టీలో, ప్రభుత్వ నామినేటేడ్‌ పదవుల్లో అవకాశం ఇవ్వడం అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్త నుంచి నాయకుని వరకు ఇక్కడ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాటిని ఎవరు పరిష్కరిస్తారని నిలదీశారు. నియోజకవర్గ పార్టీ స్థితిగతులపై సమీక్షించి పట్టించుకోవాలని, కష్టకాలంలో అండగా నిలిచిన శ్రేణులను గుర్తించి వారికి సముచిత గౌరవం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పార్టీ దూరం కావడం ఖాయమని స్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికే ముఖ్యనాయకులు, సీనియర్లు దూరమైన విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్నారు. 

పార్టీకోసం ధైర్యంగా నిలబడే కార్యకర్తలు ఉండరని, ఇది పార్టీకి తీరని నష్టంగా మారుతుందని మంత్రితో తెగేసిచెప్పిన నాయకులు, వెంటనే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని పట్టుపట్టారు. మదనపల్లె నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తాము భావించలేదని, పార్టీకి మరింత నష్టం కలగకముందే జాగ్రత్త పడాలని సూచించారు. ఈ పరిస్థితులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. పార్లమెంటు అధ్యక్షులు ప్రసాద్‌ ఈ విషయాలు పట్టించుకుంటున్నారా అని మంత్రి ఆరా తీసినట్టు తెలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, తిరుపతి ఘటనలను మంత్రి ప్రస్తావించి, మదనపల్లెలో ఇలాంటì  పరిస్థితి రాకుండా క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిసింది.    

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)